తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు… ఎన్నికల ఫలితాల విషయంలో పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రెండు, మూడు రోజుల ముందు కిందట… 130 సీట్లలో గెలుస్తామన్న ఆయన… ఇప్పుడు 150 సీట్ల లెక్క చెబుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేసినా ప్రజలు… అర్థరాత్రి వరకూ ఓట్లేసి… ప్రభుత్వాన్ని గెలిపించబోతున్నారని అంటున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితి ఉందా..?
టీడీపీని మళ్లీ గెలిపించాలన్న భావోద్వేగం ప్రజల్లో ఉందా..?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని అంచనా వేస్తే…చంద్రబాబు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ 150 సీట్లు సాధిస్తే అది వండర్ అవుతుంది. పెద్ద ఎత్తున తరలి వచ్చి.. ప్రభుత్వానికి ఓటు వేశారని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో.. జగన్, చంద్రబాబు ప్రచార అంశాలకు మౌలికమైన తేడా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే … చంద్రబాబు అమలు చేశారు. సంక్షేమ పథకాలు మాత్రమే… సెంటిమెంట్ పథకాల వ్యూహం కూడా అదే అమలు చేశారు. వీటన్నింటిని బట్టి చూస్తే… తెలంగాణలో వచ్చిన ఫలితాలే .. ఏపీలో వస్తాయన్న అంచనాను టీడీపీ నేతలు వేసుకుంటున్నారు. మహిళలు పెద్ద ఎత్తున.. ఏ కారణం లేకుండా అర్థరాత్రి లేకుండా క్యూలో నిలబడి… ఓటు హక్కును ఎందుకు వినియోగించుకుంటారన్నది టీడీపీ నేతల ప్రశ్న. రైతుల కోసం అన్నదాత సుఖీభవ, డ్వాక్రా మహిళలకు పసుపు – కుంకుమ సహా ప్రభుత్వ పథకాల ప్రకటనలన్నింటిలోనూ ఓ బావోద్వేగం పెంచేలా చేయగలిగారు. వీటన్నింటి వల్ల… ప్రభుత్వ సానుకూలత ఓట్లు… టీడీపీకి వస్తాయని.. ఆ పార్టీ నేతల అంచనా. ముఖ్యంగా మహిళల్లో… బయటకకు కనిపించని సానుకూలత ఉందని.. అంచనా వేస్తున్నారు. అభ్యర్థులను పట్టించుకోవద్దని.. తననే అభ్యర్థిగా భావించాలని… చంద్రబాబు పిలుపునిచ్చారు.
మహిళా ఓటింగ్, సోషల్ ఇంజినీరింగ్ వర్కవుట్ అయిందా..?
తెలుగుదేశం పార్టీ మహిళల ఓటింగ్ పై ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. అలాగే అమరావతి, పోలవరం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. అన్నీ మధ్యలో ఉన్న సమయంలో.. ఇప్పుడు డ్రైవర్ ని మారిస్తే… ఎలా అన్న చర్చ… ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీన్ని ప్రజలు నమ్మారు అని టీడీపీ నేతల అంచనా. ఇప్పటికే ఐదేళ్లు చూశారు.. ఇప్పుడు వర్కింగ్ ప్రోగ్రెస్… మధ్యలో డిస్ట్రబ్ చేస్తారా…? అని.. టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మధ్యలో జనసేన కూడా ఉంది. అటు టీడీపీ, వైసీపీ .. జనసేన కూటమిపై ఆశలు పెట్టుకున్నాయి. టీడీపీ ఎక్కువ అంచనాలు ఉన్నాయి. జనసేన వల్ల.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుదని.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ అనుకూల ఓటు ప్రభుత్వానికే పడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం రెండు పార్టీల మధ్య చీలిపోతుంది. అలాగే… సోషల్ ఇంజినీరింగ్ కూడా ముఖ్యం. ఈ విషయంలో టీడీపీ ప్రణాళికాబద్ధం గా వ్యవహరించింది. జనసేన పార్టీ ఉన్నప్పటికీ.. కాపుల్లో మెజారిటీ తమకు ఓట్లేశారని టీడీపీ చెబుతోంది.
తనను చూసి ఓటు వేయాలన్న చంద్రబాబు అభ్యర్థన వర్కవుట్ అయిందా..?
చంద్రబాబు… మరో వ్యూహాత్మకమైన అంశాన్ని తెరపైకి తెచ్చారు. తనను చూసే ఓటేయాలని అన్నారు. తనను.. జగన్ ను.. పక్కపక్కన పెట్టి పోల్చుకునేలా చేశారు. కానీ.. లోకేష్‌ను ఎప్పుడూ తెరపైకి తీసుకు రాలేదు. లోకేష్ కూడా.. నియోజకవర్గానికి పరిమితం అయ్యారు. ఇది కూడా… ప్లాన్డే. ఫైట్ .. జగన్ వర్సెస్ లోకేష్ అన్నట్లుగా ఉండకూడదని.. టీడీపీ ప్లాన్. దానికి తగ్గట్లుగానే వ్యవహరించారు. జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగా ఉంటేనే… అడ్వాంటేజ్ ఉంటుందని… టీడీపీ అనుకుంటోంది. తెలుగుదేశం పార్టీ.. అనే అంశాలను… సానుకూలంగా మల్చుకుని ఎన్నికల పోరాటం చేసింది. సంక్షేమ పథకాలు, సెంటిమెంట్ వంటి అంశాలను… హైలెట్ చేస్తోంది. అందుకే… టీడీపీ నేతలు… తమ అంచనాలకు పెంచుకుంటున్నారు. 150 సీట్లు అంటున్నారు. నిజం మాత్రం ఫలితాల్లో తేలాల్సి ఉంటుంది.