తెలంగాణలో ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పాలన నడుస్తోంది. కేసీఆర్ ఆధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ… కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు సహా అందరూ గవర్నర్ ను కలిసి.. కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. శాసనసభ రద్దు చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంది. శాసనసభ రద్దు చేస్తే… ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుంది. శాసనసభ రద్దు చేసిన దగ్గరల్లా రాష్ట్రపతి పాలన పెట్టలేరు. అసెంబ్లీ రద్దుపై కేసీఆర్ను రాజకీయంగా ఎంతయినా ప్రశ్నించవచ్చు కానీ.. రాజ్యాంగ పరంగా ప్రశ్నించడానికి అవకాశం లేదు.
రాష్ట్రపతి పాలనపై ఆర్టికల్ 356 ఏం చెప్పింది..?
ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్రపతి పాలన విధించాలంటే.. ఆర్టికల్ 356 ప్రకారం విధించాలి. ఈ ఆర్టికల్ 356 ప్రకారం.. ఓ రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధమైన పాలన జరగనప్పుడు మాత్రమే… రాష్ట్రపతి పాలన పెట్టాలి. చాలా మంది లా అండ్ ఆర్డర్ లేనప్పుడు కూడా.. రాష్ట్రపతి పాలన పెట్టవచ్చని కొంత మంది అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. అయితే అంతర్యుద్ధం లాంటి తీవ్రమైన పరిస్థితులు ఉండి.. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పని చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఇదే ఆర్టికల్ 356లో ఉంది. ఎస్ఆర్ బొమ్మై కేసులో… రాష్ట్రపతి పాలన విధించడానికి ఉన్న రాజ్యాంగబద్ధతను తాము సమీక్షిస్తామని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. విపక్షాలు డిమాండ్ చేశాయని రాష్ట్రపతి పాలన పెట్టరు. ఒక వేళ పెట్టినా.. కోర్టులు అంగీకరించవు. అందువల్ల రాష్ట్రపతి పాలన పెట్టాలన్నది… రాజ్యాంగ విరుద్ధమైన డిమాండ్.
ఆరు నెలల్లో ఎన్నికలు జరగకపోతే ఏం చేస్తారు..?
కేసీఆర్ శాసనసభను రద్దు చేయడాన్ని ప్రశ్నించవచ్చు. కానీ రాజకీయపరమైన ప్రశ్నలే. రాజ్యాంగపరంగా కేసీఆర్ నిర్ణయాన్ని ప్రశ్నించలేము. గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించిన కేసులో.. ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు చెప్పిన విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. గోద్రా అల్లర్ల అనంతరం .. మోడీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారు. వెంటనే ఎన్నికలు పెట్టాలని ఈసీని కోరారు. కానీ ఈసీ అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు. రాష్ట్రపతి పాలన పెట్టాలని సిఫార్సు చేసింది. ఎన్నికలు ఎప్పుడు పెట్టాలా అన్నది ఆర్టికల్ 354 ప్రకారం.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది.. ఈసీ విచక్షణాధికారం కిందకు వస్తుందని చెప్పింది. ఆ సమయంలో సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఓ లేఖ రాసింది. ఈ వివాదంపై అభిప్రాయం చెప్పమని కోరింది. అప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సిందేనని స్పష్టం చేసింది. దాన్ని ఆరు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఈ ఆరు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉండకూడదు.. వేరే ప్రభుత్వం ఉండాలి అంటే.. అది రాజ్యాంగ బద్ధం కాదు.
రాష్ట్రపతి పాలన అంటే మోడీ పాలనేనా..?
రాష్ట్రపపతి పాలన అంటే.. కేసీఆర్ పాలన పోయి..మోడీ పాలన వస్తుంది. రాష్ట్రపతి పాలన అంటే… కేంద్రం పాలనే. రాష్ట్రపతికి రాజ్యాంగపరంగా ఎలాంటి అధికారాలు లేవు. కేంద్రం ఇచ్చే సలహాలనే పాటించాలి. గవర్నర్ పాలనే అనుకుందాం.. గవర్నర్ కూడా.. కేసీఆర్కు అనుకూలంగా ఉన్నారని… చాలా సార్లు చెప్పుకున్నాం కూడా. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు కాబట్టి… కేర్ టేకర్ ముఖ్యమంత్రి. రాజ్యాంగ పరంగా.. అయితే సభ విశ్వాసం ఉన్న నాయకుడే ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. శాసనసభే లేదు కనుకు… శాసనసభ విశ్వాసం అనే ప్రశ్నే రాదు. అయితే మెజార్టీ ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన శాసనసభను రద్దు చేశారు. శాసనసభ రద్దు చేసే సమయంలో ఆయనకు పూర్తి మెజార్టి ఉంది. కాబట్టి.. ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఈ అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేశారనిపిస్తే కోర్టులకు పోవచ్చు. రాజ్యాంగ సంస్థలకూ ఫిర్యాదు చేయవచ్చు. హైకోర్టులో వివిధ రకాల కారణాలు చెప్పి పిటిషన్లు వేశారు. ఎవరైనా వేసుకోవచ్చు కానీ… ఓటర్ల లిస్ట్ రెడీ కాలేదన్న కారణంగా… ఎన్నికలు వాయిదా వేయరు. పెళ్లి కార్డు లేదన్న కారణంగా.. పెళ్లిని వాయిదా వేయరు కదా..! . ఏదో విధంగా సమాచారం పంపి… పెళ్లి జరిపించుకుంటారు. అలాగే… ఓటర్లలిస్టు కూడా. ఈ కారణంగా ఎన్నికలు ఆపరు. ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందే.
కేసీఆర్ను రాజకీయంగా ప్రశ్నించవచ్చు…!?
ఎనిమిది నెలల గడువు ఉండగా.. ఎందుకు రద్దు చేశారనేది..చాలా పెద్ద ప్రశ్న. రాజకీయ అవసరాల కోసం… వాస్తు, జాతకాల నమ్మకాలతో.. అసెంబ్లీని రద్దు చేస్తారా..అన్న విషయంపై కేసీఆర్ను బలంగా ప్రశ్నించాల్సిందే. అలాగే.. నాలుగు రాష్ట్రాల కంటే ముందే ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న రాజకీయ ఆసక్తి ఏమిటి..?. ఇవన్నీ న్యాయమైన, ధర్మమైన అడగాల్సిన ప్రశ్నలు. అదే సమయంలో రాజ్యాంగపరంగా వ్యాలిడ్ కాని వాటిని ప్రశ్నించకూడదు. రాజకీయంగా నిర్ణయాలను ప్రశ్నించవచ్చు.