తెలంగాణ ఎన్నికలు పూర్తయిపోయాయి. అనేక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. పోలింగ్‌కు ముందు సర్వేను వెల్లడిస్తే ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి… వెల్లడించలేదు. ఇప్పుడు పోలింగ్ పూర్తయింది కాబట్టి…వెల్లడించినా ఓటర్లపై చూపే ప్రభావం ఉండదు. నేను.. వ్యక్తిగతంగా చాలా మందికి చెప్పారు.. తెలంగాణ రాష్ట్ర సమితికి 70 సీట్లు వస్తాయని చెబుతూ వచ్చాను. ఈ రోజు జాతీయ మీడియా చానళ్ల ఎగ్జిట్ పోల్స్ కూడా అవి దాదాపుగా అవే చెప్పాయి. ఒక్క రిపబ్లిక్ టీవీ మాత్రమే 50 నుంచి ప్రారంభిచింది.
టీఆర్ఎస్కు 70 సీట్లు వస్తాయని అంచనా..!
ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి.. ఎంత నిజం అవుతాయన్నది ఇప్పుడే చెప్పలేము. బయట పది మందిని అడిగితే ఎనిమిది మంది ప్రజాకూటమి గెలుస్తుందని.. చెబుతున్నారు. ప్రజల్లో మహాకూటమి అధికారంలోకి వస్తుందన్న వాతావరణం ఏర్పడింది. కానీ అండర్ కరెంట్ మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉందని నా అంచనా. ప్రత్యేకంగా… గ్రామీణ ప్రాంతంలోని… నోరు లేని వోటర్ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండటం, టీఆర్ఎస్ పట్ల సార్వత్రిక అసంతృప్తి లేకపోవడం, కేసీఆర్ పట్ల వ్యక్తిగత సానుకూలత ఉండటం, ఐదేళ్ల కదా పాలించింది.. మరో చాన్స్ ఇద్దాం లే అనుకునే అభిప్రాయం ఉండటం.. ఇవన్నీ.. కూడా టీఆర్ఎస్కు కలసి వస్తున్న అంశాలు. అలాగని… టీఆర్ఎస్కు వంద సీట్లు వస్తాయనుకోవడం భ్రమే. ప్లస్ ఆర్ మైనస్ 70 సీట్లు వస్తాయన్న అంచనా.
చంద్రబాబు ప్రచారాన్ని సెంటిమెంట్ పెంచడానికి టీఆర్ఎస్ వాడుకుందా..?
తెలంగాణ రాష్ట్ర సమితి వంద సీట్లు గెలుస్తామని చెబుతోంది. గత ఎన్నికల్లో 63 సీట్లను గెలుచుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిసి 90 మంది ఎమ్మెల్యేల వరకూ ఉన్నారు. ఇప్పుడు 70 సీట్లు వస్తే ఆ మేరకు నష్టపోయినట్లే. సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దయిన తేదీ నుంచి పోలింగ్ జరిగే వరకూ పరిణామాలు పరిశీలిస్తే… టీఆర్ఎస్ బలం గణనీయంగా తగ్గింది. మహాకూటమి బలం గణనీయంగా పెరిగింది. నిజం చెప్పాలంటే.. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా.. ఓడి గెల్చినట్లే. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో రిమార్కబుల్‌గా పోరాడుతుందని మనం అనుకోలేం. టీడీపీతో పొత్తు వల్ల లాభమా.. నష్టమా.. అన్న దానిపై మరింత లోతుగా విశ్లేషణ చేయాలి. నా అంచనా ఏమిటంటే.. చంద్రబాబు నాయుడు.. ఏదో నామినల్ గా చంద్రబాబు ప్రచారం చేసి ఉంటే సరిపోయేది… ఎక్కువగా ప్రచారం చేయడం వల్ల తెలంగాణ ఓటర్లలో ఓ కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఏర్పడింది. టీఆర్ఎస్ ఏ సెంటిమెంట్ అయితే రగిలించాలని ప్రయత్నించిందో.. అది కన్సాలిడేట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు పదే పదే కేసీఆర్‌ను టార్గెట్ చేయడం వల్ల.. తెలంగాణ ఓటర్లు… మళ్లీ రిటన్ అయ్యారా అనేది చూడాలి. భారతీయ జనతా పార్టీకి సీట్లు పెరుగుతాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అంటే.. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల.. టీఆర్ఎస్కు వ్యతిరేక ఓటరు.. కాంగ్రెస్‌కు ఓటు వేయలేక.. బీజేపీ వైపు వెళ్లి ఉండవచ్చు.
సీమాంధ్ర ఓటర్లలో విభజన వచ్చిందా..?
చంద్రబాబునాయుడు.. తెలంగాణలో విస్తృత ప్రచారం చేయకుండా.. కేసీఆర్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించకుండా ఉండి ఉంటే.. మహాకూటమికి ఎక్కువ లాభం ఉండి ఉండేది. ఇప్పుడు చంద్రబాబు అలా ప్రచారం చేయడం వల్ల కరుడు గట్టిన తెలంగాణ వాదులు… కాంగ్రెస్‌కు దూరమయ్యారు. అలాగే…తెలంగాణలో.. కూటమిని గెలిపించాలన్న చంద్రబాబు ప్రయత్నం… కూడా.. సీమాంధ్ర ఓటర్లలో విభజన కు కారణం అయింది. పవన్, జగన్ పార్టీలకు చెందిన సానుభూతి పరులు … ఇక్కడ కూటమి గెలిస్తే.. చంద్రబాబు బలపడతాడని… అదే జరిగితే.. ఏపీ ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని.. ఊహించి.. వారంతా టీఆర్ఎస్కు మద్దతు పలికారు. కేసీఆర్‌ను.. ఎల్.రమణ విమర్శిస్తే ఊరుకుంటారు కానీ.. చంద్రబాబు విమర్శిస్తే.. కోర్ తెలంగాణ వాదులు యాక్సెప్ట్ చేయకపోవచ్చు.
సార్వత్రిక వ్యతిరేకత లేకపోవడం కేసీఆర్‌కు కలిసొచ్చిందా..?
ప్రభుత్వంపై.. సార్వత్రిక వ్యతిరేకత లేదు. దళిత ఓటర్లలో వ్యతిరేకత ఉంది. ఓబీసీ ఓటర్లలో సానుకూలత ఉంది. టీడీపీ బలహీనపడిన తర్వాత ఓబీసీ ఓటర్లు టీడీపీ నుంచి టీఆర్ఎస్ కు షిప్టయ్యారు. యూత్ లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. పెన్షన్ల వల్ల.. పెద్దల్లో అనుకూలత ఉంది. దీన్ని కేసీఆర్ పై రిఫరెండంగా టీఆర్ఎస్ మార్చారు. దీని వల్ల.. ఎమ్మెల్యేల వల్ల ఉన్న వ్యతిరేకత కొట్టుకుపోయింది. అంటే.. సెలక్టివ్ పాజిటివ్ ఓటు ఉంది. ఎంఐఎంతో పొత్తు కూడా కలిసి వచ్చింది. అయితే ఇవన్నీ ఫైనల్ రిజల్ట్స్ కాదు. ఒక వేళ రేపు ఫలితాల్లో ప్రజాకూటమి గెలిస్తే.. టీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందన్న విషయంపై నేను కూడా.. విశ్లేషణ చేసుకోవాలి. టీఆర్ఎస్ను ఓడించాలన్నంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి.