పటేల్ విగ్రహానికి రూ. మూడు వేల కోట్లు అచ్చి ఆంధ్రుల రాజధాని అమరావతికి కేవలం.. రూ. 1500 కోట్లే ఇచ్చారని తెలుగుదేశం పార్టీ నేతలు అవకాశం ఉన్నప్పుడల్లా వాదిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి.. జీవీఎల్ నరసింహారావు మాత్రం ఈ వాదనకు కౌంటర్లు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పటేల్ విగ్రహానికి ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. కానీ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సీఎస్ఎర్ ఫండ్స్ నుంచి.. ముఖ్యంగా అయిల్ కంపెనీల నుంచి ఈ మొత్తం వసూలు చేశారని.. తాజాగా వెల్లడయింది.
జీవీఎల్ పుట్టిన గడ్డ కన్నా పార్టీకే ఎందుకు మద్దతుగా ఉంటున్నారు..?
ప్రస్తుతం జీవీఎల్ నరసింహారావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అన్నట్లుగా అక్కడి పరిస్థితి ఉంది. జీవీఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీ అయి ఉండవచ్చు. కానీ.. పుట్టిన గడ్డపై, మాతృభాషపై.. సొంత రాష్ట్రంపై… ఎంతో కొంత మంది సానుభూతి ఉండాలి. కానీ ఆయన ఏం చేస్తున్నారంటే… తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అవసరాలు. తన రాష్ట్రానికి సంబంధించి ఐదు కోట్ల మంది ప్రజల అవసరాల మధ్య.. ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు.. ఆయన సొంత రాష్ట్రాన్ని, సొంత రాష్ట్ర ప్రజల్ని వదిలేసి పార్టీ వైపే ఉంటున్నారు. సెఫాలజిస్ట్‌గా ఓ స్థాయిలో ఉన్న వ్యక్తి. ఆయన తెలివి తేటలు, భాషా చాతుర్యం.. పుట్టిన గడ్డకు ఉయోగపడాలనే ఉద్దేశం చాలా మందిలో ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తూ అలా చేయడం లేదు. ఈ వాదన… పటేల్ విగ్రహం వద్ద వచ్చింది. పటేల్ విగ్రహానికి అటూ ఇటుగా రూ. 3వేల కోట్లు ఖర్చు పెట్టారు. పర్యాటక రంగానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. ఓ విగ్రహాన్ని చూడటానికే పర్యాటకులు వస్తున్నప్పుడు… ఓ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్.. అదీ కూడా కృష్ణా నది ఒడ్డున… ఆధునిక రాజధాని నగరం.. పర్యాటక నగరం కాదా..? సాక్షాత్తూ దలాలామా వచ్చి కాలచక్ర వేడుకలు నిర్వహించారు. అలాంటి.. పర్యాటకంగా..అమరావితికి నిధులు ఇవ్వకూడదా..?
పటేల్ విగ్రహానికి రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదని ఎందుకు చెప్పారు..?
గతంలో జీవీఎల్ పదే పదే చెప్పినదేమిటంటే.. కేంద్రం డబ్బులు ఏమీ ఇవ్వలేదని చెప్పుకచ్చారు. టీవే చాళ్లలలో కూర్చుని అదే చెప్పారు. ఇది గుజరాత్ వాళ్లే కట్టుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కానీ చాలా ఆలస్యంగా… ఆగస్టు 7. 2018లో భారత పార్లమెంట్‌కు.,.. ఈ ప్రభుత్వమే సమర్పించిన కాగ్ రిపోర్ట్ ప్రకారం.. అనేక చమురు కంపెనీలు… ప్రధానంగా..ఐదు పెట్రోలియం సంస్థల నుంచి సీఎస్ఆర్ నిధులను వసూలు చేశారు ఓఎన్డీసీ బోర్డులో సంబిత్ పాత్ర అనే బీజేపీ అధికార ప్రతినిధిని.. డైరక్టర్‌గా పెట్టారు. కేజీ బేసిన్ సహజ వాయువుల్ని తవ్వుకుని.. వందలు, వేల కోట్లు సంపాదిస్తున్న… కంపెనీలు.. సామాజిక బాధ్యతగా అమరావతి నిర్మాణానికి ఎలాంటి సహకారం అందిచండం లేదు. కానీ పటేల్ విగ్రహానికి మాత్రం వందల కోట్లు ఇచ్చాయి. ఇప్పుడు… జీవీఎల్ నరిసంహారావు సమాధానం చెప్పాలి..? వాటికి స్వయం ప్రతిపత్తి ఉన్నాయని వాదిస్తే.. ఇంకా అనేక ప్రశ్నలు బ యటకు వస్తున్నాయి.
ఆయిల్ కంపెనీల నిధులన్నింటినీ పటేల్ విగ్రహానికి వాడారా..?
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద సామాజిక సేవా కార్యక్రమాలకు మాత్రమే.. ఖర్చు చేయాలి. పటేల్ విగ్రహానికి ఇవ్వడానికి లేదు. ఇంకా చెప్పాలంటే.. అమరావతికి నిధులిస్తే.. సోషల్ రెస్పాన్సిబులిటి కిందకు వస్తుంది. ఎందుకంటే.. అమరావతి హెరిటేజ్ సిటీ. కేంద్రం ఇవ్వలేదు… అని జాతీయ అధికార ప్రతినిధిగా.. జీవీఎల్ నరసింహారావుల… పటేల్ విగ్రహానికి ఏ ప్రతిపాదికన.. పటేల్ విగ్రహానికి నిధులు ఇవ్వలేదని చెబుతున్నారు. తెలియకోవడానికి అవకాశం లేదు. పార్లమెంట్ సభ్యులందరికీ కాగ్ రిపో్ట్ వెళ్తుంది. అలాగే… పెట్రోల్, డీజిల్ ధరల బాదుడుల విషయ ఆయిల్ కంపెనీలతో అంతే అవసులు చూశారు. ఈ నాలుగేళ్లలో.. ఏడున్నర కోట్ల లక్షల కోట్ల రూపాయలు వసూలు చేశారు. పన్నులు అలా పెంచుకుంటూ పోయారు. అంబానీ, ఆదానీలు.. ఒక్క రూపాయికూడా ఎందుకు ఇవ్వలేదు. రాభెల్ డీల్ సొంతం చేసుకున్న రిలయన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదు..? . వీళ్లేవరూ.. అమరావతి నిర్మాణానికి రూపాయి ఇవ్వలేదు. కానీ.. పటేల్ విగ్రహానికి ఇచ్చారు. దీనిపై జీవీఎల్ నరసింహారావు సమాధానం చెప్పాల్సి ఉంది.