తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై… తెలుగుదేశం పార్టీ, వైసీపీ భిన్నమైన వ్యూహాలను అనుసరిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ మహాకూటమి గా ఏర్పడి కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. 2024 కల్లా… బలోపేతమై… అప్పుడు పోటీ చేస్తామని.. ఇప్పుడు పూర్తిగా.. ఏపీ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి పెట్టామని చెప్పుకొచ్చారు. ఈ రెండు పార్టీల రాజకీయ వ్యూహంలో మొదటి నుంచి తేడా ఉంది.
గెలిచే పార్టీతో పొత్తును జగన్ ఎందుకు వద్దనుకున్నారు..?
తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి .. జాతీయ రాజకీయాల్లో విభిన్నమైన వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో ఎవరు వచ్చిన తనకు సంబంధం లేదన్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా.. ప్రత్యేకహోదా ఇచ్చేవారికి మద్దతు ఇస్తామని చెప్పుకొచ్చింది. 2014 ఎన్నికల్లో అదే చెప్పింది.. వచ్చే ఎన్నికల విషయంలోనూ ప్రస్తుతానికి అదే స్టాండ్ అనుసరిస్తోంది. కానీ తెలుగుదేశం పార్టీ.. 2014 తెలుగుదేశంలో తెలివిగా… జాతీయ రాజకీయాల్లో… తెలివిగా వ్యూహాలు పన్నింది. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీపై.. ప్రజల్లో ఆగ్రహం ఉంది. అదే సమయంలో… జాతీయ రాజకీయాల్లో.. కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉంది. మోడీ ప్రధాని అవుతారన్న అభిప్రాయం దేశం మొత్తం ఏర్పడింది. అలాంటి దశలో.. చంద్రబాబు.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా.. ఏపీ ప్రయోజనాల కోసం అంటూ బీజేపీతో కలిశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. మేము ఎవరితోనైనా కలుస్తామంటూ ప్రకటనలు చేశారు. అప్పటికే… కాంగ్రెస్ పార్టీని జనం చీదరించుకుంటున్నారు. మోడీని ఆహ్వానిస్తున్నారు. అలాంటి సమయంలో జగన్ నిర్ణయం తీసుకోలేకపోయారు. కానీ.. చంద్రబాబు మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.
గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తే చంద్రబాబును గెలిపించిందా..?
బీజేపీకి ఏపీలో ఎంత బలం ఉంది..?. ఒక శాతం.. రెండు శాతం ఓటింగ్ ఉంటుందని టీడీపీ నేతలు చెబుతూ ఉండవచ్చు కానీ.. గత ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినదాంట్లో బీజేపీకి కీలక పాత్ర ఉంటుంది. బీజేపీకి ఓటింగ్ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కానీ… జాతీయ రాజకీయాల్లో అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉన్నపార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం వల్ల.. ఏపీకి లాభం కలుగుతుంది అని ప్రజలు విశ్వసించి..చంద్రబాబు వైపు మొగ్గడానికి అవకాశం వచ్చింది. 2014లో విభజన తర్వాత ఏపీ పరిస్థితి దయనీయంగా ఉంది. కేంద్ర సాయం లేకుండా… ఏపీ మనుగడ సాగించలేదు.. అనే అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాయి. ఫలితంగా.. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతారు. ఇక్కడే చంద్రబాబు చాలా తెలివైన రాజకీయ వ్యూహాన్ని అమలు చేశారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఉన్న పార్టీతో కలవడం వల్ల టీడీపీకి మైలేజీ వచ్చింది. సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల… జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా నష్టపోయారు. జాతీయ రాజకీయాల పట్ల.. సరైన వ్యూహాన్ని జగన్ డిసైడ్ చేసుకోలేకపోయారు.
ఇప్పుడూ జగన్ అదే తప్పు చేస్తున్నారా..?
2019 వచ్చే సరికి..సరిగ్గా మళ్లీ ఇదే ఇష్యూ వచ్చింది. బీజేపీ ప్రత్యేకహోదా ఇవ్వనంటోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తానంటోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు.. ఎవరు ప్రత్యేకహోదా ఇస్తే వాళ్లకు కేంద్రంలో మద్దతు ఇస్తానంటున్నాడు. ఎవరు ప్రత్యేకహోదా ఇస్తే అన్న చర్చే లేదు. వస్తే .. బీజేపీ లేదా.. కాంగ్రెస్ కూటమి రావాలి. బీజేపీ నేతృత్వంలో కూటమి అధికారంలో ఉన్నా.. ప్రత్యేకహోదా ఇవ్వబోము అని చెబుతోంది. ఇక మిగిలింది… కాంగ్రెస్ పార్టీ. ఇస్తదా.. లేదా … రాష్ట్రానికి అన్యాయం చేసింది కదా.. అనేది తర్వాతి అంశం. అసలు ఇస్తానని మాత్రం చెబుతోంది. అయినా జగన్మోహన్ రెడ్డి… లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇవ్వం అని బీజేపీకి చెబుతూంటే.. ఇచ్చే పార్టీల్లో బీజేపీని కలిపేసుకోవడం వల్ల ఆయన నష్టపోతున్నారు. చంద్రబాబు మరోసారి .. తెలివైన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశం ఉన్న ఏకైక పార్టీ… కాంగ్రెస్ పార్టీ కను.. ఆ పార్టీతో కలుస్తున్నానని.. చంద్రబాబు నేరుగా ప్రకటించారు. ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. చంద్రబాబు వాదన ఆయన వినిపిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాదనను ప్రజలు విశ్వసించారు.
“యాంటీ మోడీ – యాంటీ కేసీఆర్” వైఖరిలో చంద్రబాబు మరోసారి గెలుస్తారా..?
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వ్యతిరేక వైఖరి తీసుకోవడం ద్వారా… ఏపీ ఓటర్లలో సానుకూలత పొందే అంశాన్ని జగన్ మిస్సవుతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు.. చంద్రబాబును తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల.. తెలంగాణ ఓటర్లలో ఏదైనా మార్పు వస్తుందో లేదో కానీ.. ఏపీ ఓటర్లలో మాత్రం.. చంద్రబాబుకు సానుకూలత పెరుగుతుంది. అందువల్ల యాంటీ కేసీఆర్… వైఖరి తీసుకోవడం ద్వారా.. మహాకూటమి ఏర్పాటు చేసి… కేసీఆర్ ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నందు వల్ల.. ఏపీ ప్రయోజనాలపై దాడి చేస్తున్నటువంటి.. కేసీఆర్ కు వ్యతిరేకంగా నేను నిలబడుతున్నానని.. చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మహాకూటమి గెలిస్తే.. ఏపీలో చంద్రబాబునాయుడు పాపులారిటీ మరింతగా పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం.. కేసీఆర్ పై .. ఒక్క మాట మాట్లాడకుండా.. పోటీ నుంచి విరమించుకున్నారు. గత ఎన్నికల్లో .. మూడు అసెంబ్లీ, ఓ పార్లమెంట్ సీటు గెలుచుకున్నా.. తెలంగాణ రాజకీయ నుంచి విరమించుకున్నారు. చంద్రబాబునాయుడు.. యాంటీ టీఆర్ఎస్ విధానంతో రాజకీయం చేస్తున్నారు. యాంటీ మోడీ.. యాంటీ కేసీఆర్… పొజిషన్ తో ఏపీ ప్రజల మెప్పు పొందాలన్నది.. చంద్రబాబు వ్యూహం. జాతీయ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు దూరంగా ఉండి.. ఏపీ రాజకీయాల కోసమే ఉంటానన్న వైఖరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఇది గత ఎన్నికల్లో విఫలమయింది. ఈ సారి కూడా అదే పద్దతిలో వెళ్తున్నారు.