తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదయింది. ఏపీలో మాత్రం పోలింగ్ శాతం చాలా ఎక్కువగా ఉంది. దాదాపుగా ఎనభై శాతంగా నమోదయింది. అందులోనూ మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ విషయంలో అనేక రకాల విశ్లేషమలు వస్తున్నాయి. మహిళల మద్దతు.. ఎవరికి ఉంటుందనేదానిపై.. అనేక రకాల విశ్లేషణలు చేస్తున్నారు.
పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి అనుకూలమో చెప్పడం సాధ్యం కాదు..!
ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజీని బట్టి… ఫలానా వారికి అనుకూలం అని చెప్పడం సాధ్యం కాదు. పోలింగ్ పర్సంటేజీ అనేది… ఓ ఇండికేషన్ కాదు. మహిళలు ఎక్కువ మంది పోలింగ్లో పాల్గొన్నారు.. అంటే.. ఆంధ్రప్రదేశ్లో మహిళా ఓటర్లు ఎక్కువ. అందులోనూ… ఎనభైశాతం పోలింగ్ నమోదయింది. కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాల్లో మరింత ఎక్కువగా ఓటర్లు… ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. .పోలింగ్ బాగా పెరిగింది కాబట్టి… అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని… టీఆర్ఎస్ ఓడిపోతుంది..మహాకూటమి గెలుస్తుందన్న విశ్లేషణలు వచ్చాయి. అలాంటిదేమీ జరగలేదు. టీఆర్ఎస్ గెలిచింది. అలా అని చెప్పి.. ఏపీలోనూ… అలాగే ఉంటుందని చెప్పలేం. అయితే తెలంగాణతో పోలిస్తే.. ఓటింగ్ ఎందుకు ఎక్కువగా ఉందనేదానికి అనేక కారణాలు ఉండొచ్చు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగడం… హైలీ పోలరైజ్ రాజకీయ వాతావరణం ఏర్పడటం.. ఒకరికొకరు తీవ్రాతి తీవ్రమైన విమర్శలు చేసుకుని.. హోరాహోరీగా పోరాడటం వంటి అంశాలు.. పోలింగ్ పర్సంటేజీ పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు.
రాజకీయంగా హోరాహోరీ సాగడంతోనే ఓటింగ్ పెరిగింది..!
రాజకీయ పార్టీలు.. గ్రామంలో వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ.. రెండు శిబిరాలుగా మారిపోయిన పరిస్థితి ఉంది. అలాగే.. కులాల ప్రభావం ఉంది. ఎంత పొలరైజ్ అయినప్పటికీ… కొన్ని చిన్న పార్టీలు ఉన్నాయి. ఇలాంటివి ఉండటం వల్ల… అన్ని పార్టీల వాళ్లు… తమ తమ కార్యకర్తలను… ఓటింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు. స్వచ్చందంగా వచ్చే వాళ్లు కాకుండా రాజకీయ పార్టీల నేతలు తరలించేవాళ్లు కూడా గట్టిగానే పని చేశారు. ఆంధ్రప్రదేశ్లోఓటింగ్ పెరగడానికి మూడు కారణాలు చెప్పుకోవచ్చు. వాలంటరీ ఓటింగ్ పెరిగింది… మోటీవేటెడ్ ఓటింగ్ పెరిగింది. మొబిలైజ్డ్ ఓటింగ్ కూడా పెరిగింది. అన్ని రాజకీయ పార్టీలు.. కింది స్థాయి నుంచి.. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తో… ఏపీలో ఎన్నికల ఓటింగ్ శాతం పెరిగింది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరిగాయి.
లోపాలు లేకపోతే.. మరింత ఓటింగ్ జరిగి ఉండేదా..?
రాయలసీమలో.. రాజకీయ పార్టీల కన్నా.. నాయకుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అది కొద్దిగా ఫ్యాక్షన్ ప్రాంతం. అంతకు ముందు వ్యక్తుల మధ్య ఫ్యాక్షన్ ఉండేది. ఇప్పుడది పొలిటికల్ ఫ్యాక్షన్ గా మారిపోయింది. ఈ సెన్సెటివ్ ప్లేసెస్ లోనే ఘర్షణలు ఎక్కువగా జరిగాయి. పొలిటికల్ ఫ్యాక్షన్ ఎక్కువగా ఉన్న చోటే అల్లర్లు ఎక్కువగా జరిగాయి. భద్రతా వైఫల్యాన్ని ఈసీకీ కూడా అంగీకరించింది. సరైన బలగాలు పంపలేదని అంగీకరించారు. దాంతో సహజంగానే… ఆలస్యం అయింది. ఇప్పుడు టెక్నాలజీ… బాగా పెరిగిపోయింది. అయినప్పటికీ… ఓటింగ్ ఆలస్యం అయింది. గతంలో బ్యాలెట్ ఉన్నప్పుడు కూడా.. ఇంత ఆలస్యం అయ్యేది కాదు. అయినా.. ఆలస్యం అయింది. దీనంతటికి…. ఈసీ చెబుతున్న కారణం… బ లగాలు లేకపోవడమేనని.. గతంలోనే చెప్పేవి. ఇప్పుడు… అదే కారణం. తాము ఎన్నికల సంఘాన్ని అడిగినా.. బలగాలు పంపలేదని.. సీఈవో చెబుతున్నారు. కారణాలు చెప్పలేము కానీ…. నిజాలు చెబుతున్నామన్నారు. అంటే… ఉద్దేశపూర్వకంగా పంపలేదని అనుకోవాలి. ఎందుకంటే… రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయని.. తెలిసి కూడా… బలగాలు ఎందుకు పంపలేదన్నది కీలకమైన అంశం. ఈవీఎంలు, ఇతర సమస్యలు లేకపోతే.. ఓటింగ్ శాతం ఎంతో కొంత పెరిగేది.