తెలంగాణలో మహాకూటమిుపొత్తు కొలిక్కి రావడం లేదు. చర్చోపచర్చలు జరుగుతున్న సీట్ల పంచాయతీ తెగడంలేదు. ఒక పార్టీలో నిర్ణయాలు తీసుకోవడం సులువు. అదీ…ప్రాంతీయ పార్టీలో అయితే నిర్ణయాలు తీసుకోవడం ఇంకా సులువు. అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటే..ఎదురు చెప్పే వారండరు. టీఆర్ఎస్లో అంతే. కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటే.. ఆయన పిల్లలు కూడా అడగడానికి ఉండదు. కానీ కాంగ్రెస్లో పార్టీలో అలా సాధ్యం కాదు. అది జాతీయ పార్టీ. అందరూ కలిసి రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్లాలి. అలా వెళ్లే ముందు ఇక్కడ చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. దానికి తోడు.. కాంగ్రెస్ పార్టీ టీడీపీ, సీపీఐ, జనసమితి పార్టీలతో పొత్తులు పెట్టుకుంటోంది.
కాంగ్రెస్ బాధ్యత తీసుకోవడం లేదా..?
కాంగ్రెస్ పార్టీతో టీడీపీ, సీపీఐ, జనసమితి కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. సహాజంగా… కూటమి లక్ష్యం విజయం సాధించడం. ఎన్నికల్లో పోటీ చేసేది గెలవడానికే. ఓడినా.. గెలిచినా.. నేను రాజకీయ విలువలను పాటించానంటే.. ఎవరూ వినరు. ఏ పార్టీ అయినా.. ఇప్పుడు రాజకీయ పార్టీల విలువల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. విజయమే ముఖ్యం కనుక.. గెలిచే అభ్యర్థులు.. మిత్రపక్షాల్లో ఉన్నారా అన్నది కాంగ్రెస్ ప్రశ్న. గెలిచేవారు లేనప్పుడు.. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి..? . ఆయా పార్టీలకు గెలిచే అభ్యర్థులకు లేకపోవచ్చు కానీ… రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి రావాలంటే… ఈ పార్టీలకు చెందిన అభ్యర్థులను కూడా కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు సీపీఐకో.. జనసమితో.. టిక్కెట్ ఇస్తే.. వాళ్లకు విన్నబులా.. అంటే.. ఒక్కో నియోజకవర్గంలో విన్నబుల్ కాకపోవచ్చు. కానీ.. వారికి రాష్ట్రం మొత్తం చూస్తే ఓటింగ్ ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు.. వారి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి.
టీఆర్ఎస్ నుంచి వచ్చే వారి కోసం కాంగ్రెస్ ఎదురు చూపులా..?
కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతోంది..? మనం కూటమిగా ఏర్పడ్డాం. మన లక్ష్యం విజయం సాధించడం. అందుకే.. అక్కడ మా పార్టీ అభ్యర్థులైతేనే విజయం సాధిస్తారు అనే వాదన తెరపైకి తీసుకు వచ్చింది. రెండు పక్షాలూ… ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి. మిత్రులు వద్దనుకుంటే.. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలి. మిత్రులు కావాలనుకున్న తర్వాత… వాళ్లకి సీట్లు ఇవ్వాల్సిందే… వాళ్ల విజయానికి సహకరించాల్సిన బాధ్యత… కూడా కాంగ్రెస్ పార్టీపై ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇబ్బంది ఏమిటంటే.. నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు నేతలు టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. అంతేనా.. టీఆర్ఎస్లో టిక్కెట్లు దొరకని వాళ్లు కూడా.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. రాములు నాయక్, రమేష్ రాథోడ్.. సహా.. అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ లోని చాలా మంది ప్రముఖులపై ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అది ఎంత వరకు నిజమో చెప్పలేమో కానీ.. కాలం గడుస్తున్న కొద్దీ… టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారంతో పాటు.. అసమ్మతి కూడా ఉపందుకుంటోంది.
మహాకూటమి అభ్యర్థుల ప్రకటన తర్వాతే మళ్లీ కేసీఆర్ ప్రచారమా..?
అసెంబ్లీని రద్దు చేసిన మొదట్లో.. 50 రోజుల్లో వంద సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. హుస్నాబాద్, నిజామాబాద్, నల్లగొండ, వనపర్తి పర్యటనల తర్వాత.. కేసీఆర్ పర్యటనలు ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయంటే… అసమ్మతి పెరగడం. ప్రచారంలో ముందు ఉండటానికి అభ్యర్థుల్ని ప్రకటిస్తే.. అది అసమ్మతి పెరగడానికి కూడా కారణం అయింది. అందువల్ల ప్రత్యర్థులు.. అభ్యర్థుల్ని ప్రకటించేవరకూ ఆగాలని ఆలోచన చేస్తున్నారు. మహాకూటమి కూడా అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ఆయన మళ్లీ ప్రచారంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా.. జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. మిత్రులకు ఇప్పుడే సీట్లను ప్రకటిస్తే.. ఆయా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున… ఇండిపెండెంట్లు బయటకు వస్తారు. ఉదాహరణకు మునుగోడు సీటు ఉంది. ఓ వైపు సీపీఐ కావాలంటోంది… అలాగే.. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు కూడా తనకే టిక్కెట్ అంటున్నారు. అలాగే రాజగోపాల్ రెడ్డి కూడా తానే పోటీ చేస్తానంటున్నారు. మిత్రులైన సీపీఐకి సీటిస్తే.. కోమటిరెడ్డి… రాజగోపాల్ రడ్డి ఇండిపెండెంట్గా పోటీచేసే అవకాశం ఉంది. ఇలా చాలా సీట్లలో పోటీ ఉంది.
మహాకూటమిగానే పోటీ చేయడం ఖాయమేనా..?
మిత్రులతో తేల్చుకునే అంశాలే కాదు.. కాంగ్రెస్ పార్టీలోనే తేల్చుకోవాల్సిన అంశాలున్నాయి. అలాగే టీఆర్ఎస్లో వస్తున్న మార్పులను కాంగ్రెస్ పరిశీలిస్తోంది. వాటిని ఉపయోగించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దీనికి తోడు.. విన్నబులిటి ఫ్యాక్టర్ ను పరిశీలిస్తోంది. గౌరవప్రదమైన సీట్లు ఉండాలని.. మిత్రపక్షాల వాదన. మొత్తానికి అయితే.. అందరూ కలిసే పోటీ చేయాలనే ఆలోచన ఉంది. కానీ కొన్ని చిక్కు ముళ్లు ఉన్నాయి. ఈ చిక్కు ముళ్లను.. కాంగ్రెస్ పార్టీనే అతి పెద్దగా అధిగమించాలి. కోదండరాంకు మూడు సీట్లు ఇస్తే… కోదండరాం గౌరవానికి ఇబ్బంది కలుగుతుంది. దీని కోసం ఓ ఫార్మాలా కనిపెట్టారు. జనసమితి అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీ చేయడం. అలాగే డిప్యూటీ సీఎం హోదాతో గౌరవిస్తమని చెబుతున్నారు. ఇలాంటి ప్రత్యామ్నాయాలతో.. మహాకూటమి పక్షాలున్నాయి. పరస్పర రాజకీయ లక్ష్యం ఉంది కాబట్టి.. ఎలాగోలా సీట్ల సమస్యను పరిష్కరించుకుని.. కలసి పోటీ చేయడానికే ఎక్కువ అవకాశం ఉంది.