ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఇప్పుడు సర్వేల మీద సర్వేలు వస్తున్నాయి. ప్రధాన పోటీ టీడీపీ, కాంగ్రెస్ మధ్యే ఉందని… అన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ప్రభావాన్ని ఏ సర్వే కూడా అంచనా వేయడం లేదు. ఆ పార్టీకి రెండు నుంచి ఐదు సీట్లు మాత్రమే రావొచ్చని చెబుతున్నాయి. కొన్ని కొన్ని సర్వేలు.. అసలు జనసేన ప్రస్తావన తీసుకు రాకుండా.. అదర్స్ జాబితాలో వేస్తున్నారు అదే సమయంలో న్యూస్ ఎక్స్ అనే సర్వే సంస్థ కాంగ్రెస్ పార్టీకి నాలుగు సీట్లు వస్తాయని తేల్చింది. ఈ సర్వేల్లో చెప్పినట్లు జనసేన ప్రభావం ఏమీ ఉండదా..? కాంగ్రెస్ కొంత బలపడుతుందా..?
జనసేన కర్ణాటకలో జేడీఎస్‌లా బలీయంగా ఎదగలేకపోయిందా..?
జనసేన అధినేతతో పాటు.. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా… ఎన్నికల్లో తమ పార్టీ గణనీయమైన సీట్లు సాధిస్తుందని.. మిగిలిన ప్రధాన పార్టీలు… పూర్తి మెజార్టీ సాధించని పక్షంలో.. తామే కీలకం అవుతామని అంచనా వేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల పరిస్థితి చూస్తే.. అలాంటి ఫలితాలు వస్తాయని నేను అనుకోను. కర్ణాటకలో జేడీఎస్‌లా.. బలీయమైన శక్తిగా.. జనసేన మారే పరిస్థితులు కనిపించడం లేదు. పైకి ఏమైనా చెప్పినా కూడా.. జనసేన నేతలు కూడా… ఈ విషయాన్ని నమ్మడం లేదు. అయితే ఎన్ని సీట్లు వస్తాయనేది చెప్పలేము. సర్వే సంస్థలు సాధారణంగా.. చాలా తక్కువ శాంపిల్స్‌తో సర్వేలు నిర్వహిస్తున్నాయి. మహా అయితే నియోజకవర్గానికి వెయ్యి మందిని మాత్రమే… సర్వే చేస్తాయి. ఇంత తక్కువ మందితో సర్వే ఫలితాన్ని అంచనా వేయడం కష్టం. జనసేన ఓటర్లు అయినా ఓటర్ ఆ పార్టీకి ఓటేస్తారనుకోవడం తప్పు. ఎందుకంటే.. ఓటర్లలో రెండు రకాలు ఉంటారు.. వారిలో ఒకరు కోర్ ఓటర్. కోర్ ఓటర్… రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా.. జనసేనకే వేస్తారు. అలాగే జనసేన ఓటర్లలో మరికొంత మంది.. తమ ఓటు జనసేన అభ్యర్థికి వేస్తే మురిగిపోతుందన్న ఉద్దేశంతో… ఇతర పార్టీలకు ఓటు వేసే అవకాశం ఉంది. ఇలాంటి ఓటర్లు షిఫ్ట్ అవుతారు.
పోలరైజ్ రాజకీయంలో జనసేన వెనుకబడిందా..?
జనసేన ఓటింగ్‌కు సంబంధించిన కీలకమైన అంశాల్లో… స్ట్రాటజిక్ ఓటింగ్ ఒకటి. రాజకీయ పరిస్థితులో హోరాహోరీగా ఉన్నప్పుడు.. ఒకరిని ఓడించాలనో.. మరొకర్ని గెలిపించాలనో… రీతిలోనే.. రాజకీయ పరిస్థితులు ఉన్నప్పుడు.. ఓటింగ్ మారుతుంది. నేను.. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు… నాకు ఓటర్లు ఎందుకు వేయలేదో స్టడీ చేశా. అప్పట్లో టీఆర్ఎస్ను గెలిపించాలనుకున్న వాళ్లు.. టీఆర్ఎస్కు…. ఓడించాలనుకున్న వాళ్లు టీడీపీకి ఓటు వేశారు. నా ఓటర్లు అయినప్పటికీ… వాళ్లు.. అప్పటి రాజకీయాల కారణంగా… అటు వైపు వెళ్లారు. అంటే.. పోలరైజ్ అయ్యాయి. ఇప్పుడు ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య పోరు కేంద్రీకృతమయి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పార్టీలకు ఓటింగ్ … కన్సాలిడేట్ కాదు. అంటే.. జనసేన ఓటర్లు కూడా… స్ట్రాటజిక్ గా… రాజకీయ పరిస్థితుల్ని బట్టి… వారు ఎవరు గెలవాలనుకుంటున్నారో …. లేదా ఎవరినైనా ఓడించాలనుకుంటున్నారో.. వారి వైపు మొగ్గుతారు.
ఓటింగ్ ద్వారానే రాజకీయ పార్టీ బలాన్ని అంచనా వేయలేము..!
ఒక్క జనసేన విషయంలోనే కాదు… చిన్న పార్టీలన్నింటికీ ఈ సమస్య ఉంది. ఈ స్ట్రాటజిక్ ఓటింగ్.. టీడీపీ, వైసీపీ రెండింటి వైపు ఉంది. టీడీపీకి ఓట్లు వేసేవాళ్లు.. ఒక్క టీడీపీ ఓటర్లే కాకపోవచ్చు. అలాగే వైసీపీ. ఇప్పుడు ఏపీలో భారతీయ జనతా పార్టీ ఓటర్లు ఉన్నారు. వారంతా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారు తమ పార్టీకి ఓటు వేయడం వల్ల ఆ ఓటు మురిగిపోతుంది. అలా అనుకున్నారనుకోండి… వారు కచ్చితంగా… తమకు కేంద్రంలో మద్దతిస్తారని… భావిస్తున్న వైసీపీకి ఓటు వేస్తారు. ఒక్క బీజేపీ మాత్రమే కాదు.. అన్ని చిన్న పార్టీల ఓటింగ్… వాళ్ల పూర్తి బలాన్ని ప్రతిఫలించవు. ఈ పొలరైజ్… పొలిటికల్ బ్యాటిల్లో… ప్రజలు కూడా.. తమ ఓటు నిర్ణయాత్మకంగా ఉండాలనుకుంటారు. అలాగే రాజకీయ పార్టీలకు బలంతో సంబంధం లేకుండా సీట్లు రావొచ్చు. ఎలా అంటే.. అభ్యర్థి వ్యక్తిగత బలం మీద. తెలంగాణ ఎన్నికల్లో ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి ఒకరు గెలిచారు. ఆ పార్టీకి బలం ఉన్నట్లు కాదు కదా..! ఆ కోణంలో చూసినా.. బీజేపీ, కాంగ్రెస్‌కు సీట్లు వస్తాయని నేను అనుకోను.