ముందస్తు ఎన్నికలపై తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ రద్దుపై వరుసగా కోర్టుల్లో పిటిషన్లు పడుతున్నాయి. అలాగే ఓటర్ల జాబితాలపైనా కోర్టుల్లో విచారణ జరుగుతోంది. అసెంబ్లీ రద్దు చేయడం కాకుండా.. రద్దు చేసిన విధానం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని.. కాంగ్రెస్ నేత డీకే అరుణ పిటిషన్ వేశారు. ఎన్నికల సంఘం.. ఇలాంటి వాటితో తమకు సంబంధం లేదని.. ఎన్నికలు నిర్వహించడమే తమ విధి అని చెబుతోంది. గవర్నర్ తన విదులను సరిగ్గా నిర్వర్తించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి..?
గవర్నర్ విచక్షణాధికారాలు ఉపయోగించలేదా…?
అసెంబ్లీ రద్దు చేసే అధికారం ముఖ్యమంత్రి సంపూర్ణంగా ఉంటుంది. రాజ్యంగం ప్రకారం… పూర్తి మెజార్టీ ఉన్న ముఖ్యమంత్రి అసెంబ్లీని రద్దు చేయవచ్చు. ఒక వేల మెజార్టీ కోల్పోయిన ముఖ్యమంత్రి అనుకుందాం…. అలాంటి సీఎం సభను రద్దు చేయమంటే… గవర్నర్ తన విచక్షణాధికారులను ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే.. సభను రద్దు చేయమన్న ముఖ్యమంత్రికి..మెజార్టీ ఉండకపోవచ్చు కానీ.. ప్రత్యామ్నాయ నేతకు అవకాశం ఉంటే… ఆ ప్రయత్నం చేయాలి. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే వారుంటే వారికి అవకాశం ఇవ్వాలి. ఈ విషయంలో గవర్నర్ తన విచక్షణాధికారులు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. పిటిషనర్ కూడా.. ఈ విచక్షణాధికారాల గురించే ప్రస్తావించారు. గవర్నర్ తన విచక్షణాధికారాలు వాడకుండా.. కేసీఆర్ ఎం చెబితే అదే చేశారని.. పిటిషనర్ వాదన. కానీ రాజ్యాంగం ప్రకారం..సభ మెజార్టీ ఉన్న.. సభ విశ్వాసం కలిగిన ముఖ్యమంత్రి… రాజ్యాంగబద్ధంగా పవర్ ఉన్న ముఖ్యమంత్రి సభను రద్దు చేయమని సిఫార్సు చేస్తే.. గవర్నర్‌కు మరో అవకాశం లేదు.
అసెంబ్లీకి చెప్పే రద్దు చేయాల్సి ఉందా..?
పిటిషనర్ లేవనెత్తిన రెండో పాయింట్.. సభను ఇన్వాల్వ్ చేయకుండా.. నిర్ణయం తీసుకున్నారనేది. అసలు అసెంబ్లీని సమావేశ పర్చకుండా.. ఎమ్మెల్యేలకు చెప్పకుండా.. కేబినెట్‌కు చెప్పకుండా.. రాజ్యాంగ విరుద్ధంగా రద్దు చేశారనే వాదన వినిపిస్తున్నారు. కేబినెట్‌కు చెప్పారా లేదా అన్నది ముఖ్యమంత్రి ఇష్టం. మన పార్లమెంటరీ వ్యవస్థలో ముఖ్యమంత్రిపై మాత్రమే సభావిశ్వాసం ఉంటుంది. కేబినెట్… సీఎం విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మంత్రులు ఎవరు ఉండాలనేది.. ముఖ్యమంత్రి ఇష్టం. దాన్ని ప్రశ్నించలేం. శాసనసభకు ఇన్ఫార్మ్ చేశారా అన్నది పిటిషన్ లేవనెత్తిన మరో పాయింట్. పూర్తి మెజార్టీ ఉన్న ముఖ్యమంత్రి అసెంబ్లీని రద్దు చేయాలంటే.. శాసనసభలో చెప్పాలనో.. తీర్మానం చేయాలనో.. మరో ప్రాసెస్ చేపట్టాలనో.. రాజ్యంగంలో ఎక్కడా లేదు. అందువల్ల పిటిషనర్ వాదన.. రాజ్యాంగ ప్రకారం… లీగల్‌గా ఇప్పుడున్న ఇంటర్ ప్రిటేషన్ ప్రకారం నిలబడదు. న్యాయ వ్యవహారాల్లో ఇప్పుడున్న ఇంటర్ ప్రిటేషన్ ప్రకారమే అంతా నడుస్తుంది. సుప్రీంకోర్టు కొత్త ఇంటర్ ప్రిటేషన్ ఇస్తే దానికి మనం ఏం చేయలేం. కేసులు, రాజ్యాంగ నిబంధనలు ప్రకారం చూసుకుంటే.. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ రికమెండ్ చేయడం చట్టబద్దమే.
సుప్రీంకోర్టు కొత్తగా రూలింగ్ ఇస్తుందా..?
రేపు సుప్రీంకోర్టు మరో రకమైన వ్యాఖ్యానం ఇస్తే.. అప్పుడు మనం ఆలోచించాలి. ఒకప్పుడు ఆర్టికల్ 356 ఉంది. రాష్ట్రపతి పాలనకు సంబంధించిన అధికరణ. కేంద్ర కేబినెట్ సిఫారసు చేస్తే.. రాష్ట్రపతి… ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విదిస్తున్నారు. ఒకప్పుడు ఈ అధికరణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే.. ఎస్ఆర్ బొమ్మై కేసులో అదే సుప్రీంకోర్టు … అలా ఎలా కుదురుతుంది.. కేంద్ర కేబినెట్ సిఫార్సు చేసినా… రాష్ట్రపతి పాలనపై దాఖలయ్యే పిటిషన్లను తాము పరిశీలిస్తామన్నారు. అలా… ఈ కేసులోనూ.. ఏదైనా ఇంటర్‌ప్రిటేషన్ ఇస్తే పరిశీలించవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం అసెంబ్లీని రద్దు చేయడానికి కేసీఆర్… పూర్తి అధికారాలు ఉన్నాయి.
కేసులేస్తే అసెంబ్లీని రద్దు చేస్తారా..?
కేసీఆర్ పై ఏ విషయమైనా ప్రశ్నించాలంటే.. నైతిక పరమైన అంశాలే ఉంటాయి. అందులో మొదటిది… ముందుగా ఎందుకు అసెంబ్లీని రుద్దు చేశారన్నది…? ప్రజలు పాలించమని ఐదేళ్లు అధికారం ఇస్తే.. ముందుగానే ఎందుకు ఎన్నికలకు వెళ్తున్నట్లు..? ఏమైనా రాజ్యాంగ సంక్షోభం వచ్చిందా.? ఎమ్మెల్యేలు తిరగుబాుట చేశారా..? ఏమీ లేవు కదా.. ముందస్తు ఎన్నికల వల్ల ప్రజలపై చాలా భారం పడుతుంది. ఇది నైతికపరరమైన ప్రశ్న. ఇక రాజకీయ పరంగా చూస్తే.. పార్లమెంట్ ఎన్నికలతో అసెంబ్లీ ఎన్నికలు జరిపిస్తే.. రాజకీయంగా నష్టం జరిుతుందని భావిస్తూ.. మందుగానే అసెంబ్లీని రద్దు చేయడం.. రాజకీయంగా ప్రశ్నించవచ్చు. నైతికంగా, రాజకీయంగా.. అసెంబ్లీ రద్దు ప్రశ్నించదగ్గదే. కానీ రాజ్యాంగ పరంగా కేసీఆర్ చేసిందేమీ తప్పు కాదు.
రాజకీయ లాభం కోసమే అసెంబ్లీ రద్దు..!
కోర్టుల్లో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న వాదనేమిటంటే.. తమపై … కోర్టుల్లో పిటిషన్లు వేశారు. రాజకీయ సుస్థిరతకు ఇబ్బంది తెచ్చి పెట్టారని చెప్పుకొచ్చారు. అస్థిరత ఎక్కడ ఉంది. కోర్టుల్లో పిటిషన్లు వేస్తేనే అస్థరతనా..? రేపు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే.. మళ్లీ కేసులేస్తారు. మళ్లీ అసెంబ్లీని రద్దు చేస్తారా..? అపొజిషన్ కేసు వేయడం అనేది… అది వాళ్లకు ఉన్న హక్కు. దీన్ని కేసీఆర్ క్వశ్నన్ చేయలేదు. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడానికి కారణం.. పూర్తిగా రాజకీయమే. కాంగ్రెస్ పంజుకోక ముందే ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనతోనే కేసీఆర్ ఎన్నికలకు వెళ్లారు. అయితే రాజ్యాంగం ప్రకారం కరెక్టే. సుప్రీంకోర్టు దీనిపై ప్రత్యేకంగా ఏమైనా కామెంట్లు చేస్తే తప్ప… ఇప్పటికి కేసీఆర్ చేసిందే కరెక్ట్.