రాఫెల్ స్కాం విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీని వెనుక ఏం జరిగిందనేది.. హాట్ టాపిక్ గా మారుతోంది. ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధ విమానాల కంపెనీ దస్సాల్ట్ ఏవియేషన్‌తో ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి యూపీఏ ప్రభుత్వ హయాంలో 126 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం 2012లో 95 శాతం చర్చలు పూర్తయ్యాయి. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది.
సంతకాలకు సిద్ధంగా ఉన్న ఒప్పందాల్ని రద్దు చేసిన మోడీ..!
నిజానికి మోడీ ఒప్పందం రద్దు చేయాడానికి పదిహేను రోజులు ముందు దస్సాల్ట్ కంపెనీ ప్రతినిధితో పాటు.. ఫ్రాన్స్‌లోని భారత రాయబారి కూడా మీడియాతో మాట్లాడి.. ఇక సంతకాలు చేయడమే మిగిలి ఉందని చెప్పారు. కానీ ఆ తరవాత పదిహేను రోజులకే ఒప్పందాన్ని రద్దు చేశారు. కొత్త ఒప్పందం చేసుకున్నారు. అందుకే ఈ పదిహేను రోజుల వ్యవధిలో ఏం జరిగిందన్నదే.. అందరికీ అనుమానాస్పదంగా మారింది. 2015 నరేంద్రమోడీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినప్పుడు.. రాఫెల్ డీల్ అంశం ఎజెండాలో లేదు. అప్పటి ఫారిన్ సెక్రటరీ జయశంకర్ స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పారు. దేశాధినేతలు. పెద్ద పెద్ద అంశాలపై చర్చించుకుంటారని.. రాఫెల్ డీల్ అంశం.. చర్చలకు రాదని స్పష్టం చేశారు. ఒప్పందాలు కూడా ఉండవు అన్నారు. ఆ ప్రకటన రాఫెల్ ఒప్పందం చేసుకోవడానికి కొద్ది గంటల ముందు చేసింది. అంటే అప్పటికీ.. ఆ ఒప్పందం విషయం రహస్యంగానే ఉంది. అంటే మొత్తంగా పదిహేనుల్లో మార్పు వచ్చింది. ఈ పదిహేను రోజుల్లో కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ.. రాఫెల్ డీల్‌కు క్లియనర్స్ ఇచ్చిందా..?. ఒప్పందం రివైవ్ చేయను కూడా చేయలేదు. అయినా సరే మోడీ… ఏకపక్షంగా పాత ఒప్పందాన్ని రద్దు చేసి… కొత్తగా ఒప్పందం చేసుకోవడానికి కారణం ఏమిటి..? ఆ పదిహేను రోజుల్లే ఏమైంది..?
ఈ లోపే కొత్త కంపెనీ పెట్టిన అనిల్ అంబానీ..!
మార్చి 25 2015లో దస్సాల్ట్ సీఈవో సంతకాలే మిగిలి ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత పదిహేను రోజుల్లో ఒప్పందం రద్దు చేసుకున్నారు. ఈ పదిహేను రోజుల్లో ఏం జరిగిందంటే.. అనిల్ అంబానీ ఓ కంపెనీని రిజిస్టర్ చేశారు. అనిల్ అంబానీ డిఫెన్స్ లిమిటెడ్ దాని పేరు. ఇక్కడే కథ అడ్డం తిరగింది. ఎప్పుడైతే అనిల్ అంబానీ.. కంపెనీ పెట్టారో… అప్పుడే.. దస్సాల్ట్ కంపెనీ పార్టనర్‌గా ఉన్న .. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పక్కకు తప్పుకుంది. ఆ స్థానంలో.. అనిల్ అంబానీ కంపెనీని భాగస్వామిగా చేర్చారు. అందుకే అప్పటి వరకూ జరుగుతున్న ఒప్పంద చర్చలను రద్దు చేసి కొత్తగా ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయం ఫారిన్ సెక్రటరీకి తెలియదు. వారం రోజుల ముందు వరకు.. రక్షణ మంత్రికి కూడా తెలియదు. ఎందుకంటే.. అప్పటి రక్షణ మంత్రి.. ఒప్పందానికి వారం రోజుల ముందు కూడా.. హెచ్ఏఎల్తో ఒప్పందం ఉంటుందని మాట్లాడారు. ఇంత హఠాత్తుగా మోడీ ఎవరికీ తెలియకుండా. రాఫెల్ డీల్‌ను మార్చుకోవడానికి కారణం.. మోడీ, అనిల్ అంబానీ మధ్య కుదిరిన అవగాహనే కారణమా అన్న అనుమానాలున్నాయి.
హెచ్ఏఎల్ స్థానంలో పార్టనర్‌గా అంబానీ కంపెనీ..!
మార్చి 25న చర్చలన్నీ పూర్తయ్యాయని కంపెనీ చెప్పింది. మూడు రోజులకు అనిల్ అంబానీ కొత్త కంపెనీ పెట్టారు. తర్వాత రెండు వారాల్లోపే.. పాత ఒప్పందం రద్దు చేసి.. హెచ్ఏఎల్ను తొలగించి… అనిల్ అంబానీ..కంపెనీకి భాగస్వామిగా చేర్చారు. ఇండియన్ పార్టనర్ అంటే.. ఒప్పందంలో ఓ క్లాజ్ ఉంది. ఏది దస్సాల్ట్ కంపెనీ నుంచి కొన్నా… వాటిలో యాభై శాతాన్ని ఇండియన్ పార్టనర్ కంపెనీ వద్ద ఉత్పత్తి చేయాలి. దాని వల్ల… ఢిపెన్స్ టెక్నాలజీని.. ఇండియన్ కంపెనీని నేర్చుకుంటుందన్న ఉద్దేశంతో ఈ క్లాజ్ ఏర్పాటు చేశారు. హెచ్ఏఎల్ ప్రభుత్వ రంగ సంస్థ.. అలాంటి సంస్థను తొలగించి అనిల్ ఆంబానీ కంపెనీని ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఈ కంపెనీ 9వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. దీనికి కేంద్రం విచిత్రమైన వాదన తీసుకొస్తోంది. దస్సాల్ట్ కంపెనీ ఇండియన్ పార్టనర్‌గా అనిల్ అంబానీని ఎంచుకుంది. ప్రభుత్వానికి సంబంధం లేదంటున్నారు. కానీ ఓ విదేశీ ప్రైవేటు కంపెనీ.. ఇండియాలో పార్టనర్‌ను పెట్టుకోవాలంటే.. ఆ రంగంలో అనుభవం ఉన్న కంపెనీని ఎంచుకుంటుంది. కానీ అనిల్ అంబానీ కంపెనీకి ఎలాంటి అనుభవం లేదు. యుద్ధవిమానాల తయారీలో అస్సలు అనుభవం లేదు. పైగా కంపెనీ 9వేల కోట్ల నష్టాల్లో ఉంది. అలాగే మొత్తం అనిల్ అంబానీ కంపెనీలు… బ్యాంకులకు పడిన బాకీ రూ. లక్షా ఇరవై ఒక్క వేల కోట్లు. ఇన్ని అప్పులు ఉన్న.. అనుభవం లేని కంపెనీతో ఎవరవైనా ఎంచుకుంటారా..?.
అంబానీ కంపెనీకి ఎలాంటి అనుభవం లేదు..!
ఒక వేళ నిజంగానే దస్సాల్ట్ కంపెనీ… ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను తొలగించి.. అనిల్ అంబానీ కంపెనీని పార్టనర్‌గా ఎంచుకుందనే అనుకుందాం. మరి ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. ఇది ప్రభుత్వం, ప్రభుత్వం మధ్య కుదుర్చుకున్న ఒప్పందం. అభ్యంతరం చెప్పడానికి భారత ప్రభుత్వానికి పూర్తి సాధికారిత ఉంటుంది. దస్సాల్ట్ కంపెనీ… అప్పుల పాలై, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న కంపెనీతో ఒప్పందం చేసుకోవడాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు. అన్ని రకాల అర్హతలున్న ప్రభుత్వ రంగ కంపెనీతో ఒప్పందం చేసుకోమని ఎందుకు సిఫార్సు చేయలేదు. ఇవన్నీ చూస్తూంటే.. అనిల్ అంబానీ కోసమే.. రాఫెల్ డీల్‌ను మార్చి ఒప్పందం చేసుకున్నారని అనుమానిస్తున్నారు. త్వరగా యుద్ధవిమానాలు రావాలని.. ఒప్పందం మార్చుకున్నామని అరుణ్ జైట్లీ చెబుతున్నారు. కానీ ఇప్పటికి ఒప్పందం జరిగి అరవై నెలలైనా… ఒక్క యుద్ధ విమానం కూడా రాలేదు. వచ్చే ఏడాదికి మొదటి యుద్ధ విమానం వస్తుందని చెబుతున్నారు. అంటే.. అరుణ్ జైట్లీ అబద్దం చెప్పారన్నమాట.
దేశ ప్రయోజనాలన్నింటికీ విఘాతం..!
పాత ఒప్పందంలో.. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలని ఉంది. కానీ కొత్త ఒప్పందంలో దాన్ని తీసేశారు. ఇది దస్సాల్ట్ కంపెనీకి లాభం చేకూర్చారు. ఇప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాల్సిన పని లేదు. ఇక్కడేం జరిగిందంటే.. ఈ క్లాజ్ తీసేస్తాం.. మేం చెప్పిన కంపెనీని ఒప్పందంలో చేర్చుకోమని లాబీయింగ్ జరిగింది. దీనికి దస్సాల్ట్ కంపెనీ.. సంతోషంగా ఒప్పుకుంది. మోడీ కొత్తగా చేసుకున్న ఒప్పందంలో ఒక్కో యుద్ద విమానం ధరను 24.30 కోట్ల డాలర్లుగా నిర్ణయించారు. అంటే.. గత ఒప్పందంతో పోలిస్తే ఈ ఒప్పందం ప్రకారం ఒక్కో విమానానికి మూడు రెట్లు అధిక ధర చెల్లించాలని నిర్ణయించారు. మూడేండ్లలోనే ఇంతగా ధరల్లో తేడా ఎలా వచ్చింది..? యూపీఏ ఒప్పందం ప్రకారం విమానాల తయారీ సాంకేతికతను భారత్‌కు బదిలీ చేయడానికి దస్సాల్ట్ అంగీకరించింది. తాజా ఒప్పందంలో అందుకు అవకాశమివ్వలేదు. మరో అంశం..ఈ ఒప్పందంలో విమానాల సంఖ్యను 26కు పరిమితం చేయడం.
రక్షణ మంత్రికి కూడా తెలియకుండా గూడుపుఠాణి..!
రాఫెల్ ఒప్పందంపై పారిస్‌లో ప్రధాని మోడీ సంతకం చేయడానికి రెండురోజుల ముందు భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ చేసిన ప్రకటన అందరినీ ఆశ్యర్య పరిచింది. ఈ ఒప్పందం నుంచి హెచ్ఏఎల్ను తప్పిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భారత్‌లోని ఉన్నతాధికారులకు కూడా తెలియకుండా అత్యంత గోప్యంగా ఎందుకు ఉంచారన్నదే ప్రశ్న..? యూపీఏ ప్రభుత్వ హయాంలో కుదిరిన అవగాహన ప్రకారం టెక్నాలజీని భారత ప్రభుత్వరంగ సంస్థ హెచ్ఏఎల్కు బదిలీ చేయాల్సి ఉండగా, యుద్ధ్ద విమానాలను ఉత్పత్తి చేయడంలో ఎలాంటి అనుభవం లేని ఒక భారతీయ ప్రైవేట్ కంపెనీకి టెక్నాలజీ బదిలీ ఎందుకు చేశారో ..?. నిజానికి యుద్ధ విమానాలను ఏ ధర చెల్లించి కొనుగోలు చేశారో చెప్పడానికి నిర్మల నిరాకరిస్తున్నప్పటికీ 2016-2017కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ వార్షిక నివేదిక ప్రకారం 7.5 బిలియన్ డాలర్లకు 36 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్‌కు అమ్మినట్లు వెల్లడించారు. అంటే ఒక్కో యుద్ధ విమానానికి రూ.1670 కోట్లు చెల్లించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కుదిరిన రాఫెల్ యుద్ధ విమానం ఖరీదు ధర ఒక్కొక్కటీ రు.560 కోట్లు. రాఫెల్ విమానం ధర రూ.740 కోట్లు కాగా దాన్ని 20 శాతం తగ్గించాలని డిమాండ్ చేసి భారత ప్రభుత్వం ఆ మేరకు కంపెనీని ఒప్పించింది.
స్కాం ఎవరు చేశారో చాలా క్లియర్..!
మొత్తంగా చూస్తే.. యూపీఏ ప్రభుత్వ హయాంలో.. కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఉన్న భారత ప్రయోజనాలను కపాడే.. క్లాజులన్నింటినీ తొలగించి… ప్రైవేటు కంపెనీకి లాభం కలిగేలా.. ఒప్పందం చేసుకున్నారు. ఇదంతా పదిహేను రోజుల్లోనే జరిగింది. ఇదంతా క్లియర్‌గా చూస్తే… ఎవరు తప్పు చేశారో సులువుగా అర్థమైపోతుంది.