పోలవరం ప్రాజెక్ట్ అంశం మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. చెప్పాడంటే చేస్తాడంతే అని జగన్ గురించి వైసీపీ ప్రచారం చేసుకుంటూ ఉంటుంది. దీంతో … ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సీఎం జగన్ అసెంబ్లీలో జూన్ 2021 కల్లా… పోలవరం పూర్తి చేసి తీరుతామని ప్రకటించారు. ఆ ప్రకటనలో ఆయన హావభావాలు.. బాడీ లాంగ్వేజ్ కూడా.. చేయకపోతే.. అప్పుడు అడగండి.. చూద్దాం అన్నట్లుగా ఉంటుంది. దీంతో ఈ వీడియో ఇప్పుడు.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే సమయంలో… మంత్రి అనిల్.. పోలవరం పర్యటనకు వెళ్లారు. దీంతో పోలవరం అంశంపై గత రెండేళ్లలో ఏం జరిగిందన్నదానిపై చర్చలు ప్రారంభమయ్యాయి.
గతంలో మంత్రి అనిల్.. జూన్ 2021కి పోలవరం పూర్తి చేస్తాం… బుల్లెట్ దింపుతాం అంటూ…సినిమా డైలాగులు చెప్పారు. వాటినే ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు.. వారు చెప్పిన సమయం పూర్తయింది. రెండేళ్లలో రెండు శాతం కూడా పనులు ముందుకు సాగలేదు. అంతే కాదు.. అసలు ప్రాజెక్ట్ భవితవ్యంపైనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. రివర్స్ టెండర్లతో వందల కోట్ల ఆదా అంటూ కాంట్రాక్టర్‌ను మార్చేసిన సర్కార్.. రెండేళ్లు తిరగకుండానే రూ. మూడు వేల కోట్ల అదనపు చెల్లింపులకు అనుమతి ఇచ్చింది.
ఇప్పుడు కేంద్రం చేసిన పనులకు డబ్బులివ్వకపోయినా అడగలకేపోతున్నారు. సవరించిన అంచనాలను ఆమోదింప చేసుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. చివరికి కొత్తగా పోలవరం నుంచి డెడ్‌స్టోరేజీ నుంచి నీరు ఎత్తిపోతలకు ఆమోదం తెలిపి.. ఓ ఎత్తిపోతలకు మార్చే ప్రయ్తనం చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. పోలవరం అంటే ఏపీ జీవనాడిగా ప్రసిద్ధి. అలాంటి ప్రాజెక్ట్ రాజకీయాలకు సమిధగా మారడం ఏపీ ప్రజల్ని ఆవేదనకు గురి చేస్తోంది.