చినజీయర్ స్వామి పవర్‌ను ఎవరైనా తక్కువ అంచనా వేసే వారికి ఆయన చేతలతోనే సమాధానం చెప్పారు. తాను భిక్షువునని.. కనీసం బ్యాంక్ అకౌంట్లు కూడా ఉండవని ఆయన చెప్పుకోవచ్చు కానీ.. ఆయన ఎంత పవర్ఫుల్లో తాజా ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన వనదేవతలపై ప్రవచించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడా లేదు. మొత్తం ఎక్కడివక్కడ డిలీట్ అయిపోయాయి. కొత్తగా ఎవరైనా అప్ లోడ్ చేద్దామనుకున్నా… సాధ్యం కావడం లేదు. టోటల్‌గా ఆ వీడియో అప్ లోడింగ్ బ్యాన్ అయిపోయింది. ఉన్నవన్నీ డిలీట్ అయిపోయాయి.
ఇప్పుడు సమ్మక్క – సారమ్మలపై చినజీయర్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న వీడియోలు ఎక్కడా కనిపించవు.. ఎలా కనిపించకుండా పోయాయి ? సాధారణంగా ఏదైనా వీడియోను తొలగించాలంటే.. రిపోర్టులు కొట్టాలి.. కారణాలు చెప్పాలి అయినా ఆ వీడియోను తొలగిస్తారన్న గ్యారంటీ లేదు. కానీ చినజీయర్ మాత్రం ఇలా అనుకున్నారు.. ఆ వీడియో ఆనవాళ్లు కూడా బయటకు రాకుండా చేయగలిగారు. తనపై వస్తున్న విమర్శలతో తాను మాట్లాడిన మాటలను సమర్థించుకోలేక.. అలాగని ఖడించలేక.. వీడియోలను కనిపించకుండా చేయాలనుకున్నారు. చేశారు.
కేసీఆర్‌తో ఆయనకు చెడింది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం తరపున ఆయనకు సహకారం అంది ఉండకపోవచ్చు. అయితే జీజేపీతో ఆయనకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. సోషల్ మీడియా కూడా కేంద్రం అదుపులో ఉంటుంది. ఈ కారణంగా ఆయన పై స్థాయిలో ప్రయత్నాలు చేసి.. వీడియోను డిలీట్ చేయించారని.. మళ్లీ అప్ లోడ్ కాకుండా చూసుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే నిజం కూడా. అందుకే చినజీయర్ ఆషామాషీ బలవంతుడు కాదని చెప్పేది.