నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని ఆస్తి తగాదాలు మరింత బాధిస్తున్నాయన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. శరత్ బాబుకి వారసులెవరూ లేరు. అయితే.. ఆయనకున్న ఆస్తిని అన్నదమ్ముల బిడ్డలకు, తోబుట్టువులకు 13 వాటాలుగా చేసి రాసిచ్చారని తెలుస్తోంది. వాటాలు విడగొట్టి చాలాకాలమైంది. అయితే శరత్ బాబు పేరుమీద మరింత ఆస్తి ఉంది. అది ఎవరికి చెందాలన్న విషయంలో మరోసారి తగాదాలు వచ్చాయని తెలుస్తోంది. విషయమేంటంటే.. శరత్ బాబు ఆసుపత్రి ఖర్చులన్నీ ఆయన బంధువులే భరిస్తున్నార్ట. ఆయన కోలుకొని.. మళ్లీ తమకు మిగిలిన ఆ ఆస్తి కూడా రాసిస్తారన్న ఆశతో… ఆసుపత్రి బిల్లులన్నీ ఎవరికి వాళ్లు మీద వేసుకొంటున్నారని టాక్. శరత్ బాబుకి వైవాహిక జీవితంలో ఎదురు దెబ్బలు తగిలాయి. ఆయనకు పిల్లలు లేరు. సోదరుల బిడ్డల్ని తన సొంత బిడ్డలుగా చూసుకొంటూ వచ్చారు. కాకపోతే… ఆస్తిపాస్తులు మాత్రం బాగానే సంపాదించినట్టు టాక్. హైదరాబాద్, చైన్నైలలో ఆయనకు ఇళ్లూ, స్థలాలూ, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. వాటి గురించే ఇప్పుడు గొడవ మొదలైంది.