అమెరికాలో అదానీపై నమోదైన కేసు విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. తాను రాజ్ భవన్ భవన్ లోకి వెళదామనుకున్నా పోలీసులు పోనియలేదని అందుకే రోడ్ మీద ధర్నా చేశామని చెప్పుకొచ్చారు. అఅదానీతో కలిసి డీల్స్ చేసుకుంటూ ధికారంలో ఉండి ధర్నాలు చేయడమేమిటని.. బీఆర్ఎస్ చేసిన విమర్శలకు అక్కడి నుంచే రేవంత్ కౌంటర్ ఇచ్చారు. అదానీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేద్దాం కలసి రావాలని సవాల్ చేశారు.
అదానీతో బీఆర్ఎస్ నేతలకే ఎక్కువ సంబంధాలు ఉన్నాయని వారి హయంోల తెలంగాణలో అదానీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టారని రేవంత్ చెబుతున్నారు. అయినప్పటికీ ఆయన అవినీతి వ్యవహారాలపై జేపీసీ వేయాలని తీర్మానం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ పిలుపుపై బీఆర్ఎస్ స్పందించలేదు కానీ…రేవంత్ ది పేక్ ధర్నా అని విమర్శలు గుప్పించింది. ముందు అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని హరీష్ రావు సలహా ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ ను తిడుతున్నారు కానీ ఎప్పుడూ అదానీని తిట్టలేదన్నారు.
మరో వైపు కిషన్ రెడ్డి కూడా రేవంత్ తీరుపై మండిపడ్డారు. ఆయన సెన్సేషలిజం చేసుకుని పాలన చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అదానీ అంశంలో బీజేపీపై విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎన్నో అంశాలపై విచారణ చేయిస్తామన్నారని వాటి సంగతేమయిందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా ముందుకు తీసుకళ్డడం లేదన్నారు. ఓ వైపు అదానీతో రేవంత్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరో వైపు అదానీకి వ్యతిరేకంగా పార్టీ పరంగా ఇచ్చిన పిలుపును కూడా సక్సెస్ చేశారు. మొత్తంగా అదానీ తెలంగాణలో కూడా ఓ పొలిటికల్ టూల్ అయ్యారు.