బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగి అధ్యక్షుడు పక్క దేశానికి పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ లోనూ అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్లు ఇస్లామాబాద్ ను ముట్టడించారు. చుట్టూ దిగ్బంధించడంతో ప్రభుత్వం ఆర్మీకి కాల్పుల ఉత్తర్వులు ఇచ్చింది.దాంతో ఆర్మీ ఇస్లామాబాద్ ను ముట్టడించిన ఇమ్రాన్ సపోర్టర్లను పిట్టలను కాల్చినట్లుగా కాల్చి చంపుతోంది. ఇప్పటికే పాతిక మంది వరకూ చనిపోయారని అంటున్నారు. కానీ అసలు విషయం బయటకు రానియడం లేదు.
ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో పెట్టి .. ఆయన పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా చేసి మరోసారి ప్రధాని అయ్యారు షాబాజ్ షరీఫ్. అవినీతి ఆరోపణల పేరుతో ఇమ్రాన్ ఖాన్ ను చాలా కాలంగా జైల్లో ఉంచారు.ఆయన సపోర్టర్లు ముందుగా ఖాన్ ను రిలీజ్ చేయాలని ఆందోళనలు చేశారు. ఇప్పుడు ఇస్లామాబాద్ ను ముట్టడించారు. పాకిస్తాన్ లో సంకీర్ణ ప్రభుత్వమే ఉంది. గతంలోనూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఉన్న ఆర్మీ మద్దతు లేకపోవడంతో ఆయన దిగిపోవాల్సి వచ్చింది.
ఇలాంటి కాల్పుల ఘటనల వల్ల పాకిస్థాన్ లో పరిస్థితి మరింత దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. బంగ్లాదేశ్ లో కూడా షేక్ హసీనా తన ప్రత్యర్థి అయన ఖలీదా జియాను ఏళ్ల తరబడి జైల్లో పెట్టారు. ఇది కూడా అక్కడి ప్రజల్లో తిరుగుబాటుకు కారణం అయింది. ఇప్పుడు ఇమ్రాన్ ను జైల్లో పెట్టడం కూడా అలాగే అవుతోంది. అయితే షేక్ హసినా ఇండియాకు పారిపోయారు కానీ.. షాబాజ్ షరీఫ్ మాత్రం పారిపోవాల్సి వస్తే ఇండియాకు వచ్చే చాన్స్ లేదు.