సైరా … ప్రి రిలీజ్ ఫంక్షన్లో ఫృధ్వీరాజ్ ప్రసంగం.. ఆయన వ్యవహారశైలి… టాలీవుడ్లోనే కాదు.. వైసీపీలోనూ.. అనేక రకాల చర్చకు కారణం అవుతోంది. వైసీపీకి ప్రచారం చేయడం వల్ల సినీ అవకాశాలు రాలేదని.. వైసీపీ అగ్రనేతల వద్ద మొరపెట్టుకుని ఎస్వీబీసీ చానల్ చైర్మన్ పదవి పొందిన ఫృధ్వీరాజ్.. దీని కోసం.. .మెగా ఫ్యామిలీనే ఉపయోగించుకున్నారు. అల్లు అర్జున్ సినిమాలో.. తన డేట్స్ తీసుకుని తర్వాత పక్కన పెట్టారని.. మెగా కుటుంబం మొత్తం తమ సినిమాల్లో తనను ఎవాయిడ్ చేస్తోందని.. తనకు అవకాశాలు సన్నగిల్లిపోయాయని.. ఫృధ్వీరాజ్.. వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాల్లో ప్రచారం చేసుకున్నారు. ఈ కారణంగా మెగా కుటుంబంపై… సోషల్ మీడియాలో విపరీతమైన వ్యాఖ్యలు వచ్చాయి. దీన్ని ఫృధ్వీరాజ్ ఎప్పుడూ ఖండించలేదు. కానీ అది నిజమేనన్నట్లుగా… ఎవరి అండతోనో తాను ఇండస్ట్రీలో నిలబడనంటూ.. వ్యాఖ్యలు చేసి కలకలం చేశారు.
అయితే.. మెగా కుటుంబం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సైరా నరసింహారెడ్డిలోనే ఫృధ్వీరాజ్ కు కీలక పాత్ర లభించింది. ఆయనకు… ప్రి రిలీజ్ ఫంక్షన్కు ఆహ్వానం కూడా అందింది. మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు. స్టేజ్ పై నుండి.. మెగా ఫ్యామిలీని ఆకాశానికెత్తేశారు. పనిలో పనిగా అవకాశాలు ఇవ్వాలని దర్శకుల్ని కూడా తనదైన పద్దతిలో కోరారు. దీంతో.. ఫృధ్వీరాజ్ తీరుపై.. మరోసారి చర్చ ప్రారంభమయింది. ఎన్నికల ప్రచారం సమయంలో.. ఫృధ్వీరాజ్.. జగన్కు మద్దతు ఇవ్వడం అంటే… పక్క పార్టీ వాళ్లను తిట్టడమే అన్నట్లుగా ప్రచారం చేశారు. ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పైనా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక విమర్శలు చేస్తే సహిస్తారేమో కానీ.. వ్యక్తిగతంగా కించ పరిస్తే.. ఎవరూ సహించరు. కానీ ఫృధ్వీరాజ్ అదే చేశారు.
సినీ అవకాశాలు ఇవ్వకుండా… రాకుండా.. మెగా కుటుంబం చేస్తోందని.. ప్రచారం చేసి.. ఎస్వీబీసీ చైర్మన్ పదవిని పొందిన ఫృధ్వీరాజ్.. ఇప్పుడు.. మళ్లీ అదే కుటుంబం అండ దక్కించుకుని.. అవకాశాలు పొందాలని ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు ప్రారంభమయ్యాయి. పవన్ కల్యాణ్ ను.. వ్యక్తిగతంగా కించ పరిచిన ఘటనల గురిచి.. తాము మర్చిపోమని.. మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి ఫృధ్వీరాజ్ తీరు మాత్రం… తేడాగా ఉందన్న అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.