రాజకీయాల్లోకి వెళ్లి రాజకీయానికి బలైపోయిన ధర్టీ ఇయర్స్ ఫృధ్వీ ఇప్పుడు .. రాజకీయం కన్నా.. సినీ రంగమే చాలా బెటర్ అని అనుకుంటున్నారు. ఇక్కడ చిరంజీవి కాకా పట్టేస్తే.. చాలు.. కనీసం బహిరంగంగా పొగిడితే చాలు చాన్సులొస్తాయని.. డిసైడైపోయారు. ఇప్పుడు … చిరంజీవి స్తోత్రం అందుకున్నారు. ఎన్నికల సమయంలో… మెగా క్యాంప్ పై తీవ్రమైన విమర్శలు చేసి… ఆ క్యాంప్ నుంచి అవకాశాలు అందకుండా చేసుకున్న ఆయన ఇప్పుడు… వైసీపీ రాజకీయానికి బలైపోయిన తర్వాత .. మళ్లీ ఆ మెగా క్యాంపే గుర్తుకు వచ్చింది. సైరాలో ఓ చిన్న పాత్ర చేసిన ఫృధ్వీ ఇప్పుడు అవకాశాల కోసం.. చిరంజీవి పొగడటమే పనిగా పెట్టుకున్నారు.
చిరంజీవి లేకపోతే.. తాను ఆత్మహత్య చేసుకునేవాడనని భారీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. రాజకీయంగా బలైపోయిన తర్వాత తాను మానసికంగా ఇబ్బందిపడ్డానని, నాకు వేషాలు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని చిరంజీవి చెప్పారని.. లేకపోతే లేకపోతే నేను సూసైడ్ చేసుకునేవాడినని తనని కదిలించిన చిన్నా.. చితకా యూట్యూబ్ చానల్స్ వాళ్లందరికీ చెబుతున్నారు. పదవికి రాజీనామా చేసినప్పుడు.. రేపట్నుంచి ఖాళీ అందర్నీ కడిగి పారేస్తానని ప్రకటించిన ఫృధ్వీ ఆ తర్వాత అడ్రస్ లేరు. పదవి వచ్చిన ఉత్సాహంలో ఇండస్ట్రీ మొత్తాన్ని విమర్శించేశారు. జగన్ సీఎం కావడం.. ఇండస్ట్రీలోని పెద్దలు ఇష్టం లేదని.. అందుకే వచ్చి విష్ చేయలేదని.. కూడా విమర్శలు గుప్పించారు.
అప్పట్లోనే.. ఆయన తీరు తీవ్ర విమర్శల పాలయింది. ఎదిగిన ఇండస్ట్రీనే అవమాన పరుస్తున్నారని అన్నారు. చివరికి రాజకీయం దెబ్బ చాలా వేగంగానే తగిలింది. మళ్లీ ఇప్పుడు ఇండస్ట్రీ శరణు కోరుతున్నారు. దానికి చిరంజీవి ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. అంటే.. ఇప్పుడు ఫృధ్వీకి జగన్ కంటే.. చిరంజీవే గొప్పన్నమాట.