ధర్టీ ఇయర్స్ ఫృధ్వీ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన తర్వాత బయట పెద్దగా కనిపించలేదు. కానీ.. తనపై సొంత పార్టీ వాళ్లే కుట్ర చేశారని ఆయన కుమిలిపోయారని.. మానసికంగా.. వేదనకు గురై.. అనారోగ్యం పాలయ్యానని ఆయన చెబుతున్నారు. ఎస్వీబీసీలో.. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేస్తానని చెప్పినందుకే తనపై కుట్ర జరిగిందని.. అంటున్నారు. పదవికి రాజీనామా చేస్తూ.. ప్రెస్మీట్ పెట్టిన ఫృధ్వీ.. తర్వాతి రోజు నుంచి అందర్నీ కడిగేస్తానని సవాల్ చేశారు. అయితే.. మళ్లీ కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్స్ వచ్చాయి. అయితే.. ఫృధ్వీ మాత్రం.. జరిగింది మొత్తం.. సొంత పార్టీ వాళ్లు.. ఎస్వీబీసీ చానల్లోని వారేనని.. క్లారిటీ తెచ్చుకుని మథనపడుతున్నారని అంటున్నారు.
ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయించిన తర్వాత … ఫృధ్వీని వైసీపీలో పట్టించుకునేవారు కూడా లేరు. ఆయనతో ప్రెస్మీట్లు పెట్టించడం కానీ.. ఏదైనా అంశంపై మాట్లాడాలని.. పిలిచిన వారు కూడా లేరు. గతంలో అయితే… చోటామోటా.. వైసీపీ నేతలు.. తమ తమ నియోజకవర్గాల్లో ఏమైనా కార్యక్రమాలు పెట్టుకుంటే… ఫృధ్వీని ఆహ్వానించేవారు. ఫృధ్వీ కూడా.. వెళ్లి వచ్చేవారు. అయితే.. ఇప్పుడు.. ఆయన ఇమేజ్ మసకబారిపోవడంతో.. ఆయనను పిలిచేందుకు ఎవరూ సాహసించడం లేదు. అదే సమయంలో..ఆయన పార్టీకి భారమే కానీ.. ప్రయోజనం లేదని.. వివాదాస్పద వ్యాఖ్యలతో నష్టం చేస్తారన్న భావనకు రావడంతో… వైసీపీ హైకమాండ్ కూడా.. ఆయనకు ఓదార్పు ఇవ్వడం లేదు.
దీంతో.. తన బాధ చెప్పుకునేందుకు ఆయన మళ్లీ.. మీడియా ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు దేవుడి కంటే.. పూజరే పవర్ ఫుల్ అని తెలుసుకున్నారేమో కానీ… జగన్ కన్నా ముందు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి జపం చేస్తున్నారు. తాను వారికి మాత్రమే జవాబుదారీగా ఉంటానని ప్రకటనలు చేస్తున్నారు. వైసీపీలో వీరి ముగ్గురి మధ్య ఆధిపత్య పోరాటం ఉంటుందన్న ప్రచారం ఉంది. అందుకే.. ఫృధ్వీ తన సినిమా తెలివి తేటలు ప్రదర్శించి.. ముగ్గుర్నీ ఒకే సారి కవర్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఫృధ్వీకి మాత్రం.. వైసీపీలో గత వైభవం కనిపించే అవకాశం ఇప్పుడల్లా లేదంటున్నారు.