30 ఇయర్స్ ఇండ్రస్ట్రీ ఫృథ్వీ… ఈమధ్య కమెడియన్లలో బాగా పాపులర్ అయ్యింది… బాగా నవ్విస్తోందీ తనే. కాకపోతే ప్రతి సినిమాలోనూ ఒకటే కామెడీ. బాలయ్యను డైలాగుల్ని ఇమిటేట్ చేయడం, ఆయన గెటప్పుల్లో దూరిపోతూ బాలయ్యలా కనిపించడానికి తాపత్రయ పడడం ఇదీ…వరుస. మోనాటనీ వచ్చేస్తోంది బాబోయ్ అంటూ సగటు సినీ అభిమాని కంగారు పడుతుంటే… బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఫృథ్వీపై ఫైర్ అవుతున్నారు. ఈమధ్య జక్కన్నలో కూడా ఇదే వరుస. అందులోనూ బాలయ్యలా డైలాగులు చెప్పి నవ్వించడానికి ట్రై చేశాడు. బాలయ్య ఇమిటేషన్ రోజురోజుకీ ఎక్కువైపోతుండడంతో బాలయ్య ఫైన్స్ మనోడికి గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. దాంతో ఫృథ్వీ కూడా జాగ్రత్త పడిపోయాడు. ”బాలయ్యని ఇక మీదట ఇమిటేట్ చేయను… నన్ను క్షమించండి” అంటూ సందేశం పంపాడు.
బాలయ్యంటే తనకెంతో ఇష్టమని, తన దేవుడని… చెబుతున్నాడు ఫృథ్వీ. ఆయన్నీ ఆయన అభిమానుల్నీ కింపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ”జక్కన్న సినిమాలో నా పాత్ర ఎవరినైనా హర్ట్ చేసుంటే క్షమాపణలు కోరుతున్నా. ఇక మీదట ఇలాంటి పాత్రలు చేయనని మాటిస్తున్నా” అంటున్నాడీ కమిడియన్. ఎంత కమెడియన్ అయినా ఎవరి పరిధుల్లో వాళ్లుంటే మంచిది. ఫ్యాన్స్‌తో పెట్టుకొంటే ఇలానే ఉంటుంది మరి.