మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఎవరైనా మరో ఆలోచన లేకుండా ఒప్పుకుంటారు. కానీ ఒకరు మాత్రం మెగా ఆఫర్ ని వదులుకున్నారు. ఆయనే మలయాళం స్టార్ పృథ్వీరాజ్. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ ని గాడ్ ఫాదర్ గా చిరు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకుడు. ఐతే చిరు ఫస్ట్ ఛాయిస్ మాత్రం మాతృక దర్శకుడు పృథ్వీరాజ్. గాడ్ ఫాదర్ కి దర్శకత్వం వహించాల్సిందిగా పృథ్వీరాజ్ ని కోరారు చిరు. ఐతే అప్పటికే చాలా ప్రాజెక్ట్స్ తో బిజీగా వుండటం వలన పృథ్వీరాజ్ కి కుదరలేదు. అలాగే సైరా నరసింహ రెడ్డిలో కూడా ఒక పాత్ర చేయమని కోరారు చిరు. అప్పుడు కూడా పృథ్వీరాజ్ కి కుదరలేదు.
తాజాగా దీనిపై స్పదించారు పృథ్వీరాజ్. ”మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ చేయడం ఆనందంగా వుంది. ఆయన ఇమేజ్ కి సరిపడే కథ ఇది. దర్శకత్వం వహించమని అడిగారు. కానీ నాకు కుదరలేదు. అంతకుముందు సైరా నరసింహ రెడ్డిలో కూడా ఒక పాత్ర కోసం అడిగారు. వేరే షూటింగ్ లో వుండి చేయలేకపోయా. లూసిఫర్ 2 కూడా తెరకెక్కిస్తాను. ఈ సినిమాని కనుక చిరంజీవి గారు రిమేక్ చేసి దర్శకత్వం వహించిమని అడిగితే ఈసారి తప్పకుండా చేస్తా” అని చెప్పుకొచ్చారు పృథ్వీరాజ్.