వల్లభనేని వంశీకి ఒక్క చిన్న చాన్స్ కూడా ఇవ్వకుండా పోలీసులు ముందుకెళ్తున్నారు. ఆయనపై కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తుందో కానీ ఆ తర్వాత అయినా ఆయన బయటకు రాకుండా పోలీసులు పీటీ వారెంట్లు రెడీ చేస్తున్నారు. ఇందు కోసం పాత కేసులన్నీ వెలికి తీస్తున్నారు. వంశీ నిందితుడిగా ఉన్న ఇతర కేసులపై కృష్ణా జిల్లా పోలీసులు దృష్టి పెట్టి వివరాలు బయటకు తీస్తున్నారు.
గతంలో గన్నవరం ఎలైట్ హోటల్ దగ్గర జరిగిన దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో షాపుల కూల్చివేత కేసుల్లో నిందితుడుగా ఉన్న వంశీని అదుపులోకి తీసుకునేందుకు పీటీ వారెంట్లు జారీ చేయనున్నారు. ఎన్నికల సమయంలో జరిగిన పలు గొడవల్లోన వంశీని నిందితుడుగా చేర్చే అవకాశం ఉంది. వంశీ నిందితుడుగా ఉన్న కేసుల్లో పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్న పోలీసులు.. నూజివీడు, గన్నవరం కోర్టుల్లో రేపు లేదా ఎల్లుండి పీటీ దాఖలు చేయనున్నారు.
ఒక కేసు తరవాత ఒక కేసులో పీటీ వారెంట్లతో వంశీని కనీసం ఆరు నెలలు జైల్లో పెట్టే చాన్స్ ఉంది. అయితే ఇప్పుడు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులోనే అసుల బెయిల రాకుండా చేయాలని అనుకుంటున్నారు. నేరుగా ఫిర్యాదు దారుడ్ని బెదిరించిన కేసు కాబట్టి..ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం లేదు. అందుకే సత్యవర్థన్ తో న్యాయమూర్తి ముందు మరోసారి వాంగ్మూలం ఇప్పించారు. మెజిస్ట్రేట్ ఎదుట సత్య వర్ధన్ 164 స్టేట్ మెంట్ రికార్డు చేయించారు. కేసు వెనక్కి తీసుకోవాలని వంశీ సత్య వర్ధన్ ను బెదిరించారని నమోదైన కేసులో తాజాగా మరోసారి మెజిస్ట్రేట్ ఎదుట సత్య వర్ధన్ చెప్పారు. దీంతో వంశీపై కేసు మరింత క్లిష్టంగా మారనుంది.