ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్ల పాటు అంతా నా ఇష్టం అన్న రీతిలో పాలన చేశారు. చట్టాలు పట్టించుకోలేదు.. రాజ్యాంగాన్ని లెక్కలోకి తీసుకోలేదు. కోర్టులూనూ అసలే లైట్ తీసుకున్నారు. ఎంత అడ్డగోలుగా అయినా తాము అనుకున్న నిర్ణయాలను అమలు చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా తన విధానాలను మార్చుకుంటన్నారు. యూటర్న్ అని.,. మడమ తిప్పుతున్నారని ప్రజలు, విపక్ష పార్టీల కార్యకర్తలు ఎంత విమర్శలు చేస్తున్నా ఆయన మాత్రం గత రెండున్నరేళ్ల కాలం రివర్స్ నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. మండలి రద్దు..మూడు రాజధానుల నిర్ణయం దగ్గర్నుంచి చివరికి మద్యం ధరల తగ్గింపు వరకూ ఈ నిర్ణయాలు కొనసాగుతున్నాయి. ముందు ముందు మరిన్ని రివర్స్ నిర్ణయాలు ఉండే అవకాశం కనిపిస్తోంది.
మొదటి మూడేళ్లు చేయాల్సిన మర్డర్లు చెయ్ .. దోచుకోవాల్సింది దోచుకో.. తరవాత రెండేళ్లు మాత్రం ఎన్నికల కోసం ప్రజల కోసం అన్నట్లుగా పని చెయ్య. ప్రజలు మొదటి మూడేళ్ల సంగతి మర్చిపోతారు.. అని ఇటీవల వచ్చిన ఓ సినిమాలో డైలాగ్. సీఎం జగన్ తీరు చూస్తూంటే ఇదే పద్దతిని ఫాలో అవుతున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉండేవారిలో అత్యధిక మంది వ్యతిరేకంగా మారారని ఇటీవల సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి.. మద్యం ధరలు. మద్యం తాగే వారిలో రోజుకూలీలు అత్యధిక మంది సీ ఎం జగన్ ను మద్యం దుకాణాల వద్ద బండబూతులు తిడుతూ ఉంటారనేది అందరికీ తెలిసిన విషయం. నిజానికి అలాంటివారే గతంలో జగన్‌కు హార్డ్ కోర్ సపోర్టర్లుగా ఉన్నారు. ఇంత వరకూ వారినే మద్యం ధరలతో దోచుకోవడం.. ఊరూపేరూ లేని బ్రాండ్లతో వారి ఆరోగ్యాన్ని సైతం చెడగొట్టడం.. చాలా మందికి నచ్చలేదు.ఈ ఫీడ్ బ్యాంక్ ప్రభుత్వానికి అందిందేమో కానీ మద్యం ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. ఇది మడమ తిప్పడమే అయినా జగన్ ఆలోచించలేదు.
మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో సీఎం జగన్ భారీగా తనపై ప్రజావ్యతిరేకత పెంచిన నిర్ణయాల విషయంలో వెనక్కి తగ్గాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగి.. ఎక్కడెక్కడ ప్రజావ్యతిరేకత ఎక్కువగా ఉందో.. రిపోర్ట్ ఇచ్చారని.. దాని ప్రకారం ముందుకు వెళ్తున్నారని భావిస్తున్నారు. అయితే సీఎం జగన్ ఒక్క సారిగా రివర్స్ నిర్ణయాలు తీసుకోవడం ప్రజల్లో ఆయనుక నిలకడ లేదన్న అభిప్రాయం కల్పిస్తుంది. ఏదనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోవడం.. తర్వాత వెనక్కి తీసుకోవడం కామన్‌గా మారిందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఇది ప్రజల్లో ఆయన ఇమేజ్‌కు మచ్చలా పడుతోంది.