రుషికొండ వైపు అడుగు పెడితే అరెస్టు చేసేవారు ఎన్నికలకు ముందు.. ఇప్పుడు .. రుషికొండ ప్యాలెస్ గేట్లు ప్రజలు చూసేందుకు ఓపెన్ చేశారు. గంటా శ్రీనివాసరావు స్థానిక నేతలు, మీడియా ప్రతినిధులతో వెళ్లి ప్యాలెస్‌ను పరిశీలించారు. అత్యం విలాసవంతమైన ఆరు బ్లాక్‌లు మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి. ఐదు వందల కోట్లతో కట్టారని.. లక్షలు విలువ చేసే కమోడ్లు పెట్టారని జరిగిన ప్రచారంలో అబ్దదమేం లేదు.
హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లోనూ అంత లగ్జరీ సౌకర్యాలు ఉంటాయో లేదో చెప్పడం కష్టం . టూరిజం పేరుతో కట్టేసి.. సీఎం క్యాంప్ ఆఫీసుకు బాగుంటుదని సిఫారసు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గవర్నమెంట్ మారడంతో ఇప్పుడు జగన్ అక్కడ అడుగు కూడా పెట్టలేకపోయారు. కానీ ఆయన చేసిన దుబారా అంతా బయటపడుతోంది.
నిజానికి రుషికొండ మంది మంచి టూరిజం కాంప్లెక్స్ ఉంది. దాన్ని కూలగొట్టి ఇష్టారాజ్యంగా రుషికొండను తొలిచేసి.. కనీస అనుమతులు లేకుండా భవనాలను నిర్మించారు. ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. అక్కడ నిబంధనలు ఉల్లంఘించారని నివేదికలు కూడా వచ్చాయి. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. అయితే ఈ రుషికొండ నిర్మాణంలో జరిగిన ప్రతి ఉల్లంఘనకు బాధ్యుడైన అధికారిపై చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.