సిద్ధం పేరుతో సభలు పెడుతున్న జగన్ రెడ్డి ప్రజలకు తాను ఎంతటి ప్రమాదకారో… తనకు మళ్లీ ఓటు వేస్తే ఎంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయో అంచనా వేసుకోమని శాంపిల్ చూపిస్తున్నారు. దెందులూరు వద్ద నిర్వహిస్తున్న సిద్ధం సభ కోసం ఆయన టీం చేసిన అరాచకాలు చూస్తే.. .. ఇలా కూడా చేస్తారా అని ఎవరైనా ఆశ్చర్యపోతారు.
ఓ రాజకీయ పార్టీ సభ కోసం పబ్లిక్ పరీక్షలను వాయిదా వేయడం చరిత్రలో జరిగిందా ?. ఇప్పుడు జరిగింది. ఇంటర్ పబ్లిక్ పరీక్షలను వాయిదా వేసేశారు. అదీ కూడా కొన్ని జిల్లాల్లో విద్యార్థులకు మాత్రమే. విద్యారంగ నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు. జన సమీకరణ కోసం స్కూల్ బస్సులన్నింటినీ వాడుకోవడానికి ఈ నిర్ణయం. పరీక్షలనే కాదు.. స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. కొన్ని జిల్లా పరిధిలో సభ నిర్వహిస్తున్నందున ఆయా జిల్లాల స్కూళ్లన్నింటికీ సెలవులు ఇచ్చేశారు.
ఇక చెట్లు కొట్టేశారు.. పంట కాలువలు పూడ్చేశారు… జాతీయ రహదారిపై డివైడర్లను కూడా తొలగించారు. ఇంత అరాచకం చేసి సభ నిర్వహించాల్సిన అవసరం ఏమిటో అని ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఇంకా విషయం ఏమిటంటే ఈ సభలకు ప్రజలు పన్నులుగా కట్టిన సొమ్మునే ఖర్చు పెడుతున్నారు. వేల కొద్దీ ఆర్టీసీ బస్సుల్ని వాడుకుంటున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
పెద్దందారు తాము సిద్ధమంటూ ఇచ్చే బిల్డప్‌కు ప్రజలకు నరకం కనిపిస్తోంది.