కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు రోజుల పాటు ఆయన పర్యటనలో ఎక్కడికి వెళ్లినా ఇసుక వేస్తే రాలనంత జనం తరలి వచ్చారు. సాధారణంగా పార్టీ అధినేత వస్తే నేతలు జన సమీకరణ చేస్తారు. ఇప్పుడు కూడా చేశారు. కానీ వారు చేసిన సమీకరణ ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే ఉంటుంది. వారు వెయ్యి మందిని తరలిస్తే చంద్రబాబు సభలకు పదివేల మంది కనిపించారు. ఇలాంటి జన ప్రభంజనం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడే కనిపిస్తుందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన అనగానే మూడు రాజధానుల పేరుతో కొంత మంది కార్యక్రమాలు ప్లాన్ చేశారు. ర్యాలీలు చేశారు. అయితే ఆ ర్యాలీల్లో అందరూ స్కూళ్లు, కాలేజీల నుంచి తరలించుకు వచ్చిన విద్యార్థులే ఉన్నారు. వారినుద్దేశించే నేతలు ప్రసంగాలు చేశారు. వారికి ఓట్లు ఉండవని వారు గుర్తించలేపోయారు. ఇత చంద్రబాబును అడ్డుకుంటామని గంభీరమైన ప్రకటనలు చేశారు. ఒక్క చోట మాత్రం వైసీపీ ఎమ్మెల్యే పీఏ ఒకరు ఇరవైమందితో హడావుడి చేశారు. తర్వాత ఎవరూ కనిపించలేదు. ఆ జనం ముందుతాము తేలిపోతామనుకున్నారు.
కర్నూలు పర్యటనలోనూ చంద్రబాబు అమరావతి రాజధాని అంశానికి ప్రజల నుంచి మద్దతు పొందారు. ఒకే రాజధాని ఉండాలని..అది అమరావతే ఉండాలని పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు లభించేలా చూసుకున్నారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు ఎక్కడ పర్యటన జరిగినా జన స్పందన అధికంగా ఉంటోంది. రాయలసీమలోనూ అదే స్పందన కనిపించడం టీడీపీ నేతలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ప్రభుత్వ వేదింపులు.. పథకాలు ఆపేస్తామని బెదిరింపులు ఎక్కడా పని చేయడం లేదు.
ప్రస్తుతం వైసీపీ నేతలు మీటింగ్ పెట్టాలంటే… డ్వాక్రా మహిళలు, పథకాల లబ్దిదారులే దిక్కు., వారిని బెదిరించి సభలకు తెచ్చుకుంటున్నారు. జగన్ పర్యటనల్లో అలా తీసుకొచ్చిన వారు సభ ప్రారంభం కాక ముందే వెళ్లిపోతున్నారు. దానికి భిన్నంగా చంద్రబాబు పర్యటనలు సాగుతున్నాయి.