మాజీ మంత్రి ఆర్కే రోజా మాటల్ని ఆమె పిల్లలు కూడా అసహ్యించుకునే పరిస్థితి వస్తోంది. రాజకీయం అంటే ఆమె ఏమనుకుంటున్నారో కానీ.. రాజకీయ ప్రత్యర్థుల్ని, వారి కుటుంబాల్ని, కుటుంబాల్లో వచ్చిన కష్టాలను రాజకీయానికి ముడిపెట్టి ఘోరమైన వ్యాఖ్యలు చేస్తూ అందరిలోనూ అసహ్యం పెంచుకుంటున్నారు. పవన్ కల్యాణ్ పిల్లల గురించి ఆమె అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు కారణం అవుతున్నాయి. ఇంత ఘోరమైన వ్యక్తి ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారు.
రాజకీయంలో ఉన్నప్పుడు ప్రత్యర్థిని వ్యక్తిగతంగా విమర్శించడమేతప్పు. కానీ రోజా ఆ వ్యక్తిగతాన్ని కుటుంబానికి అన్వయిస్తున్నారు. పిల్లల చెడు కోరుకుంటున్నారు. తనకు మంత్రి పదవి వచ్చినప్పుడు చిరంజీవి ఇంటికెళ్లి కాళ్లకు దండం పెట్టారు. ఇప్పుడు ఆ చిరంజీవికి ఎంతో ఇష్టమన పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు కీడు జరగాలని కోరుకుంటున్నారు. రోజా మాటలు ఆడవాళ్ల గౌరవాన్ని తగ్గించేలా ఉంటాయి. కానీ ఆమె లేడీ అనే రిజర్వేషన్ తోనే తనపై ఎవరూ ఎదురుదాడి చేయకుండా చూసుకుంటున్నారు.
వ్యక్తిగతంగా, రాజకీయంగా ఆమెకు ఇప్పుడు శ్రేయోభిలాషులు ఎవరూ లేరు. వైసీపీలో కూడా ఆమెకు ఎలాంటి గుర్తింపు ఉండదు. ఆ దుర్గంధమైన వాక్ప్రవాహాన్ని వాడుకుని బూతులు తిట్టించడానికి ఉపయోగించుకుంటారు. రేపు బయటపడేస్తారు. ఎందుకంటే ఇప్పటికే భరించలేమని అర్థమైపోయింది. రాజకీయం పోయాక టీవీల్లోకి వెళదామంటే.. సాయం చేసేవారు లేరు. ఎంత మందిని సంప్రదిస్తే ఎలాంటి అవకాశాలు వచ్చాయో రోజాకే కాదు ఇండస్ట్రీకి తెలుసు. ఎందుకా పరిస్థితి వచ్చింది?.
రోజా ఇప్పుడు పద్దతిగా మారినా ఎవరూ ఆమెను అభిమానించడం కాదు కదా.. న్యూట్రల్ గా కూడా చూడలేరు. చివరికి తన పిల్లలు కూడా ఆమెను అసహ్యించుకునే స్థితికి చేరిపోతారు.