ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెప్టెంబర్ 9 ఓ ప్రత్యేకమైన తేదీగా నలిచిపోతుంది. ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు చాలా స్పష్టంగా కనిపించిన రోజు అది. తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతల్ని వేధించాలనుకున్న జగన్ రెడ్డి తీరును ప్రజలంతా అసహ్యించుకుంటున్న విషయం స్పష్టంగా బయటపడిన రోజు ఉంది.
చంద్రబాబు వెంట ఉత్సవంలా జనం
ఎనిమిదో తేదీన అర్థరాత్రి నుంచి చంద్రబాబు బస చేసిన బస్ వద్ద మూగి..తలుపులు కొట్టి రచ్చ చేసిన పోలీసులు… పదో తేదీ ఉదయం వరకూ.. చంద్రబాబును నిద్రపోనివ్వలేదు. 48 గంటల పాటు నిద్రలేకుండా ఆయనను తిప్పుతూనే ఉన్నారు. అయితే ఎక్కడ చూసినా జనం ఆయనకు అండగా నిలిచారు. ఆయన వాహనం వెళ్తున్న ప్రతీ ఊరిలో సంఘిభావం ప్రదర్శించారు. చాలా చోట్ల చంద్రబాబే కిందకు దిగి.. చట్టాలను గౌరవించాలని.. దారివ్వాలని కోరాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా ఆయనకు మద్దతు లభిస్తోంది. జగన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలపై తీవ్ర వ్యతిరేకత కనిపించింది.
పవన్ కల్యాణ్‌ను అడ్డుకోలేక – స్వయంగా మంగళగిరి తీసుకు వచ్చిన పోలీసులు
ఇక పవన్ కల్యాణ్ ను ఏపీకి రాకుండా అడ్డుకోవడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆయన విమానానికి అనుమతించవద్దని … ఆయన వస్తే లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసుకోలేమని చేత కాని వాళ్లలా ఎయిర్ పోర్టు ఆఫీసర్లకు లేఖలు రాసి విమానాన్ని అడ్డుకున్నారు. పవన్ రోడ్డు మార్గం ద్వారా వస్తూంటే.. ఆంధ్రాలోకి ఎంటర్ కాగానే… అదో నిషిద్ధ ప్రాంతమని.. ఎవరూ రాకూదన్నట్లుగా అడ్డుకున్నారు. కానీ ప్రజాగ్రహం వెల్లువెత్తింది. వేల మంది రోడ్లపైకి రావడంతో ఆయనను స్వయంగా మంగళగిరిలో విడిచిపెట్టారు. తన మానాన తాను కారులో వెళ్తున్న పవన్ ను అడ్డుకని.. రోడ్డు మీదరచ్చ చేయాల్సిన పోలీసులకు అవసరం ఏం వచ్చిందంటే.. అదంతే సైకోతనం అనుకోవాలి. కానీ మొత్తంగా ప్రజల ఆగ్రహం .. తిరుగుబాటు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో స్పష్టమయింది.
కట్టు తెగితే ఇక అధికార వర్గాలు అదుపు చేయడం కష్టమే !
ఇప్పటికీ ప్రజలు సంయమనంతోనే ఉన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వ్యవస్థలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లుగా భావిస్తే.. నిబంధనలు పట్టించుకోకుండా.. చట్టాలను సైతం తుంగలో తొక్కి అధికారం ఉందని అందరిపై వేధింపులకు పాల్పడినట్లుగా ప్రజలు భావిస్తే తిరరుగుబాటు తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇది ఏపీలో ఎలాంటి పరిస్థితి సృష్టిస్తుందో అంచనా వేయడం కష్టం.