వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు. కానీ జగన్ కు గాయం చేసిన రాయి తనకు కూడా తగిలిందని ఆయన బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఆయన డ్రామాల్ని ప్రజలకు మరింత గా పరిచయం చేయడానికి… కూలీ మీడియాలో ఇంటర్యూలు కూడా ఇప్పిస్తున్నారు.
ఇక జగన్మోహన్ రెడ్డి సంగతి చెప్పాల్సిన పని లేదు. రాయితో తగిలినట్లుగా చెబుతున్న గాయానికి తొలి రోజు… మినీ బ్యాండేజ్ వేసుకున్నారు. కానీ తర్వాతి రోజు పెద్ద బ్యాండేజ్ వేసుకున్నరు. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. మామూలుగా అయితే రెండు రోజుల్లో కనిపించకుండా పోయే గాయం అది. కానీ ఆయన బ్యాండేజ్ మాత్రం తీయడం లేదు.
అసలు ఒక్క రాయి ఇద్దర్ని ఎలా గాయపరిచిందనేది పెద్ద మిస్టరీగా మారిందని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఇద్దరు బ్యాండేజ్ లు వేసుకుని తిరగడం కామెడీ అయిపోతోంది. ఆ రాయి జగన్ కు బలంగా తగిలి గాయమైతే.. అక్కడే పడిపోవాలి. జగన్ కు తగిలి బంతిలా లేచి.. మళ్లీ వెల్లంపల్లి కంటికి తగిలిందా ?. అది సాధ్యమేనా.. ?. ఈ డౌట్స్ ఎవరికైనా వస్తాయి. కానీ వైసీపీ నేతలకు మాత్రం రావు. డ్రామాస్ అన్ లిమిటెడ్ పార్టీ.. స్కిట్స్ లో లాజిక్స్ వెదుక్కోవడం లేదు.