ఏదైనా సమస్యను తొక్కి పెట్టి ఉంచి.. సమస్య లేదని నమ్మిస్తే… రేపు ఆ సమస్య పెనుభూతంగా మారుతుంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ అన్ని సమస్యల్ని అలాగే తొక్కి పెట్టింది. పోలీసుల్ని ప్రయోగించి.. భయం పుట్టించి… తమకు ఎదురులేదని.. ఎవరైనా ఎదురు చెబితే.. వారి సంగతి చూస్తామని చెప్పి నోరెత్తకుండా చేసింది. ఫలితంగా అంతా బాగుందని తనను తాను మోసం చేసుకుంది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది.
రోడ్డెక్కుతున్న మోసపోయిన వర్గాలు
జగన్ రెడ్డిఅధికారం కోసం ఇవ్వని హామీ లేదు. ప్రతి ఒక్కరికీ హామీలు ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల దగ్గర్నుంచి పారిశుద్ధ్య కార్మికల వరకూ అనేక హామీలు ఇచ్చారు. చివరికి ఆయన అందర్నీ మోసం చేశారు. ఎంతగా అంటే… జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఇవాళ కాకపోతే రేపైనా ఆయన మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తూ వస్తున్నారు. కానీ మరింతగా మోసం చేయడానికి సిద్ధమవుతున్నారు కానీ చేయడం తెలియడంతో రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
ఇంత కాలం తొక్కి పెట్టారు.. ఇప్పుడు ప్రజలు తెగించారు !
ఇంత కాలం అందర్నీ పోలీసులు, కేసుల భయంతో తొక్కి పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వంపై భయం పోయింది. ఏం చేసుకుంటారో చేసుకోండని.. రోడ్డెక్కుతున్నారు. బతుకులే సర్వనాశనం అయిపోతే ఇక ప్రభుత్వానికి బయపడేదేమిటనేది వారి ఉద్దేశం. పనికి మాలిన కేసులు పెట్టి… ప్రభుత్వం చులకన అవడం తప్ప.. తమకు పోయేదేమీ లేదని వారందరికీ అర్థమయింది. ఇంత కాలం తొక్కి పెట్టారు కానీ.. ఇక వల్ల కాదని తేల్చి చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
సాధారణ ప్రజలూ రోడ్డెక్కుతారు !
ఇప్పుడు ఓ రకంగా ప్రభుత్వం పై వ్యతిరేకత నిరసనల రూపంలో బయటకు వస్తోంది. ఇది దావాలనంలా వ్యాపిస్తోంది. ఒక్కొక్క వర్గం నిరసనల్లోకి వస్తోంది. చివరికి వాలంటీర్లు కూడా నిరసన చేస్తున్నారు. రేపు ఉద్యోగులు కూడా ఉద్యోగ సంఘ నేతలని డంప్ చేసి స్వచ్చందంగా రోడ్డెక్కవచ్చు. ఎన్నకిలకు ముందు జగన్ రెడ్డి చేసిన మోసాలన్నీ ఆయన మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ నేతల అరాచకాలకు బాధితులైన ప్రజలు కూడా రోడ్డెక్కే అవకాశాలు ఉన్నాయి.