దేశంలో రెండే రెండు సర్వే సంస్థలకు అత్యధికంగా స్ట్రైక్ రేట్ ఉంది. ఒకటి మైయాక్సిస్ ఇండియా, రెండు సీఓటర్. ఈ సంస్థల సర్వేలు అత్యధిక సక్సెస్ రేటుతో ఉంటాయి. అందుకే ఈ సంస్థలు ఇచ్చే ఫలితాలపై ప్రజల్లో విశ్వాసం ఉంటుంది. ఈ సంస్థ ఇచ్చిన సర్వేలో ఏపీలో టీడీపీ ప్రభంజనం ఖాయం. జనసేనతో కలిసితే.. వైసీపీ తుడిచి పెట్టుకుపోతుందని అంచనా వేసింది. నిజానికి ఏపీలో రాజకీయ పరిస్థితుల్ని ఓ పార్టీ కోణంతో కాకుండా… న్యూట్రల్ గా ఆలోచిస్తే జగన్ రెడ్డికి చాన్సే ఉండదని అందరికీ అర్థమైపోతుంది.
అధికార అహంకారంతో జగన్ రెడ్డి తల్లి , చెల్లినే దూరం చేసుకున్నారు. ఇక ప్రజలకు దూరం కాకుండా ఉంటారా ?. అహంకారంతో చేసిన పాలనతో రాష్ట్రం నష్టపోయింది.. ప్రజలు నష్టపోయారు. బటన్లు నొక్కానని గొప్పగా చెబుతున్నారు. కానీ ఆ బటన్ల ద్వారా వచ్చినదానికన్నా జగన్ రెడ్డి తమ దగ్గర ఎక్కువ పిండుకున్నారని ప్రజలకు అర్థమైపోయింది. అదే విషయాన్ని సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. జనసేన పార్టీతో కలవడం ద్వారా.. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో అత్యంత దుర్భమైన గడ్డు పరిస్థితి ఎదురు కావడం ఖాయం.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ రెడ్డి ఏం చేశారో చెప్పుకోవడం లేదు బటన్లు మాత్రమే నొక్కానంటున్నారు. ఏం చేస్తారో చెప్పడం లేదు. అదే సమయంలో కక్ష సాధింపులతో ఆయన చేసిన రాజకీయం ప్రజల్లో వెగటు పుట్టించింది. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే భావన రాకుండా పోలీసు వ్యవస్థను చెరబట్టి ప్రజల్లో ఎలా బతకాలన్న భయాన్ని క్రియేట్ చేశారు. అది ఎంత ప్రమాదకరంగా ఉండబోతోందో సర్వేలు చెబుతున్నాయి. జగన్ రెడ్డి తనకు తాను దేవుడ్నని అనుకుంటారేమో కానీ ప్రజలు కూడా అలాగే అనుకోవాలని అనుకుంటున్నారు. కానీ ప్రజాస్వామ్యలో అసలైన దేవుళ్లు ప్రజలే. వాళ్లని నమ్మించి మోసం చేస్తే ఓటుతో బుద్ది చెబుతారు.
జగన్ రెడ్డి నిర్వాకాలపై పోరాటం చేయడంలో టీడీపీ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ఫలితంగా ప్రజాభిప్రాయం మారుతూ వస్తోంది. లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన తర్వాత టీడీపీ మెరుగుపడింది. మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అదే పెద్ద ప్రజాభిప్రాయంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పోరాటం ఇంకా కొనసాగుతోంది. తుది ఫలితం వచ్చే వరకూ ప్రతిపక్షం వెనక్కి తగ్గే చాన్స్ లేదు.