లోకేష్ పాదయాత్రకు వస్తున్న జనం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ రోజుకారోజూ అంచనాలకు అంతనంత మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా గోరంట్లలో లోకేష్ పాదయాత్రలో ఊరిలో సగం మంది పాల్గొన్నారు. కిలోమీటర్‌కు పైగా జనం లోకేష్ తో పాటు నడిచారు. తర్వాజ జరిగిన చిన్న బహిరంగసభ కిక్కిరిసిపోయింది. కనీసం యాభై వేల మందికిపైగా పాదయాత్రలో పాల్గొని ఉంటారని అంచనా. ఈ జన ప్రవాహం చూసి వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చినప్పుడు ఇందులో సగం మందిని కూడా సమీకరించలేకపోయామని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున లోకేష్ పాదయాత్రకు ఎందుకు వస్తున్నారా అని వారు ఆశ్చర్యపోతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత లోకేష్ పాదయాత్రలో మరింత జోష్ కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా చూపించడంతో ఎక్కువ మందిలో ధైర్యం వస్తోంది. ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రతీ చోటా చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేకపోతున్నారు. వైసీపీ స్థానిక నేత దందాలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ యాత్రకు సంఘిభావం చెప్పేందుకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారన్న అభిప్రాయ వినిపిస్తోంది. టీడీపీ నాయకులు కూడా. ఇలా వచ్చే జనాన్ని కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు.
పాదయాత్రకు వచ్చే వారిని లోకేష్ ఎక్కడా నిరాశపర్చడం లేదు. కార్యకర్తలకు సెల్ఫీలు ఇచ్చేందుకు ఆయన గంట సమయం కేటాయిస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. యువనేతను దగ్గరగా చూడటమే కాదు.. ఆయన విజన్ కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున యువత తరలి వస్తోంది. పాదయాత్ర ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడు ప్రభంజనంలా మారిందని ముందు ముందు జన సునామీ అవుతుందని టీడీపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు.
మూడు వందల మంది వాలంటీర్లు యువగళం పాదయాత్ర కోసం స్వచ్చందంగా పని చేస్తున్నారు. వీరు క్రౌడ్ ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. పెద్దగా సహకరించకపోయినా మొత్తం వీరే చక్కబెడుతున్నారు. కానీ వచ్చే జనం ఎక్కువైపోతూండటంతో వీరికీ ఇబ్బందులు తప్పడం లేదు.