ఏపీ ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఓ వైపు తమకు ఇవ్వాల్సిన జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా.. అసలు ఉద్యోగులు పని చేస్తారా.. జీతంతో వారికి పనేముంది.. లంచాలే లక్షల్లో వస్తాయన్నట్లుగా ప్రచారం చేయడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. కానీ ప్రభుత్వంపై ఉద్యమం చేయడానికి వెనుకాడుతున్నారు. పీఆర్సీ సమయంలో చేసిన ఉద్యమాన్ని ఉద్యోగ నేతలు అమ్ముకున్నారన్న అభిప్రాయంతో ఉన్న ఉద్యోగులు ఇప్పుడు మళ్లీ వాళ్లే … వచ్చి ఉద్యమం అంటూంటే పెద్దగా నమ్మలేకపోతున్నారు.
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్మును ఇప్పటి వరకూ ఇవ్వలేదు. సీపీఎస్ సొమ్మును కాజేశారు. రుణాలు , అడ్వాన్సుల కోసం పెట్టిన దరఖాస్తులు పెండింగ్లో ఉండిపోయాయి. ఇప్పుడు ఆ బాధ్యత నుంచి తప్పుకుని బ్యాంకుల నుంచి అప్పు తీసుకోమని చెబుతున్నారు. ఎన్నో రకమైన అర్థిక నష్టాలకు తోడు. తమపై దుష్ప్రచారం చేస్తూండటంతో ఉద్యోగులు నలిగిపోతున్నారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు, కేఆర్ సూర్యనారాయణ వంటి వారు తెరపైకి వచ్చి ఇక సహించేది లేదని చెబుతున్నారు. బండి శ్రీనివాసరావు,, వెంకట్రామిరెడ్డి మాత్రం తాము జగన్మోహన్ రెడ్డికి బంటులమని చెబుతున్నారు. అందుకే ఉద్యోగులు నమ్మలేకపోతున్నారు.
అయితే ఉద్యోగ సంఘం నేతల్ని పక్కన పెట్టి ఉద్యోగులే సమైక్యంగా రోడ్డెక్కితే ప్రజల నుంచి ఊహించనంత స్థాయిలో మద్దతు లభిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో చలో విజయవాడ పెట్టినప్పుడు ప్రజలే పెద్ద ెత్తున సహకరించారు. మరోసారి ఉద్యోగ నేతలు ఉద్యమాన్ని నడిపితే ప్రజల నుంచి అలాంటి సహకారం లభించదు. ఉద్యోగులే ముందుకు రావాల్సి ఉంది. అదే జరిగితే ప్రభుత్వంలోనూ కదలిక వస్తుంది. లేకపోతే… ఉద్యోగులు .. తమ ప్రయోజనాల్ని ప్రభుత్వానికి భయపడి.. వదులుకోవాల్సిందే. !