అధికారం ప్రజలు ఇచ్చేది. అలాంటి ప్రజల కన్నా తానే ఎక్కువ అనుకుంటే.. పాతాళంలోకి పంపేస్తారు ప్రజలు. చరిత్రలో జరిగింది ఇదే. ఇప్పుడు జరుగుతోంది ఇదే. భవిష్యత్ లో జరగబోయేది కూడా ఇదే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు.వారు పవర్ ఇస్తేనే ఎవరైనా కిరీటాలు పెట్టుకుంటారు. వారినే టేకిట్ గ్రాంట్ అన్నట్లుగా పరిగణిస్తే ఓటుతోనే పవర్ తీసేస్తారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రె్డి తనను ప్రజలు నెత్తిన పెట్టుకున్నారని.. తాను ఏం చేసినా ప్రజలు తనను దించరన్న ఓ నమ్మకంతో ఉన్నారు. అది ఎంతగా అంటే.. చివరికి తమ ఆస్తులు.. కుటుంబాలను కూడా ఆయన సమర్పించుకుని ఆయన పడేసే ఎంగిలి మెతుకులు తిని బతికేస్తారని అనుకుంటున్నారు. కానీ తాను అధికారం ఇస్తేనే కుర్చీలో కూర్చున్న పాలకుడు.. తమను అలా అంచనా వేస్తున్నాడని అర్థం చేసుకున్న తర్వాత ఊరుకుంటారా ?
నిజానికి జగన్ రెడ్డి ఒక్క సారి తల పైకెత్తి చూసుకుంటే.. తాను చేసిన తప్పేంటో తెలిసిపోతుంది. అధికారం వచ్చిందని అందర్నీ దూరం చేసుకున్నారు. తల్లి, చెల్లి మాత్రమే కాదు హితులు, స్నేహితులు, బంధువులు అందరూ దూరమయైపోయారు. ఇప్పుడు తనకు అధికారం ఉంది కాబట్టి.. సంపాదన ఆశతో ఉన్న కొంత మంది తన చుట్టూ ఉంటారు. కానీ.. రేపు అధికారం పోతే వారు కూడా ఉండరు. అది జూన్ నాలుగో తేదీన తెలుస్తుంది.
మొత్తంగా అధికారం రావడం గెలుపు కాదని.. ఒక్కో సారి డిజాస్టర్ అని జగన్ మోహన్ రెడ్డి నిరూపించబోతున్నారు. మొదట అధికారం వచ్చింది.. దాన్ని చూసుకుని సర్వం పోగొట్టుకున్నారు.. చివరికి ఆ అధికారం కూడా పోతుంది.