వైసీపీ ఎమ్మెల్యేలను వంద మందిని, ఎనభై మందిని మార్చేస్తామని పిచ్చిపట్టినట్లుగా వైసీపీలో రచ్చ చేసుకుంటున్నారు. వైసీపీ ఆఫీసు నుంచే ఫలానా వారికి టిక్కెట్లు లేవని మీడియాకు స్టోరీలు పంపిస్తున్నారు. ఈ పరిస్థితి చూసి వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆ ఎమ్మెల్యేలందరిపై వ్యతిరేకత ఉందని ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఈ ప్రభుత్వంపై ఎమ్మెల్యేలపై ఎందుకు వ్యతిరేకత ఉంటుది. ఏ టు జడ్ సర్వం జగన్నాథమే అయినప్పుడు.. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు ?
ఎమ్మెల్యేలకు వాలంటీర్ విలువ కూడా లేదే !
వైసీపీలో పేరుకే ఎమ్మెల్యేలు. కనీసం వాలంటీర్ కు ఉన్న విలువ లేదు. కుదిరితే దందాలు చేసుకోవడం.. లేకపోతే సైలెంట్ గాఉండటం మినహా వారు చేసిందేమీ లేదు. చూసినా మొత్తం జగనే. సర్వం జగన్నాథం అన్నట్లుగా పాలన సాగుతోంది. సంక్షేమ పథకాల విషయంలో కానీ.. ఇతర అంశాల్లో కానీ ఎమ్మెల్యే్ల ప్రమేయం లేదు. తమకన్నా వాలంటీర్లు నయమని ఎమ్మెల్యేలు అనుకునే పరిస్థితి వచ్చింది. ఓ వైపు నిధులు ఇవ్వకుండా.. మొత్తం అధికారాలు జగన్మోహన్ రెడ్డి వద్ద దఖలు పర్చుకుని చిన్న చిన్న పనులు కూడా వాలంటీర్లతో చేయించుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారు. వారిపై అసంతృప్తి ఎలా ఉంటుంది. ఉంటే గింటే సర్వం తానే అంటున్న జగన్ రెడ్డిపై ఉండాలి కానీ.
సొంత క్యాడర్ నూ దివాలా తీయించింది జగన్ రెడ్డా… ఎమ్మెల్యేలా ?
ఈ నాలుగున్నరేళ్లలో నియోజకవర్గానికి రూ. కోటి ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేసిన పరిస్థితి లేదు. కానీ బిల్లుల వస్తాయని పార్టీ నేతలతో చేయించిన పనులు బిల్లులు మాత్రం కోట్లకు కోట్లు పెండింగ్లో ఉన్నాయి. చివరికి సొంత క్యాడర్ నూ జగన్ రెడ్డి దివాలా తీయించారు. మరి ఆ క్యాడర్ ఎమ్మెల్యేపై అసంతృప్తి చెందాలా.. జగన్ రెడ్డిపైన.. !
ఎమ్మెల్యేలే అంతా చేశారని తప్పుడు ప్రచారం ఎందుకు ?
తమ ప్రభుత్వంపై అసంతృప్తి లేదని.. ఎమ్మెల్యేలపైనే ఉందని.. ఎమ్మెల్యేలందర్నీ మార్చేస్తే.. మళ్లీ వైసీపీకే పట్టం కడతారన్న వ్యూహంతో జగన్ ఉన్నారు. తాను గొప్పగా పరిపాలన చేస్తున్నానని.. సర్వేలో తనకు అరవై శాతానికిైగా సానుకూలత వచ్చిందని బలవంతపు సర్వేలతో చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలను ఇప్పుడు తమను బలి పశువుల్ని చేస్తున్నారు.