పులివెందుల బస్టాండ్ లీజు గడువు ముగిసిపోవడంతో ఆ స్థలాన్ని యజమాని లాక్ చేసుకున్నారని..బస్టాండ్ కోసం రెండు రెండు తడికలతో చిన్న పాక నిర్మించారని సోషల్ మీడియాలో దుమ్ము రేపేలా టీడీపీ ప్రచారం చేస్తోంది. ఇది ప్రజల్లో వైరల్ అవుతోంది. ఎందుకంటే జగన్ సీఎం అయిన తర్వాత బస్టాండ్ అద్భుతంగా నిర్మిస్తామని ఓ గ్రాఫిక్స్ రిలీజ్ చేశారు. మూడేల్లు అయింది.. అది ఎక్కడ వరకు వచ్చిందో క్లారిటీ లేదు. ఆ గ్రాఫిక్స్ చూపించి.. జగన్అలా చేస్తానన్నారు.. కానీ ఇలా చేశారంటూ తడికల పందిరి చూపిస్తున్నారు. దీనికి వైసీపీ నేతలు ఎలాంటి కౌంటర్ ఇవ్వడం లేదు. అక్కడ బస్టాండ్ బాగుందని.. అది ఫేక్ అని చెప్పడంలేదు.
నిజంగానే పులివెందుల బస్టాండ్ ప్రస్తుతానికి తడికల పందిరే. అయితే బస్టాండ్ స్థలం లీజు అయిపోలేదు. అది ప్రభుత్వానిదే. బస్టాండ్ కోసం నలభై ఏళ్ల క్రితంఓ దాత ప్రభుత్వానికి ఇచ్చారు.అక్కడ భారీ మల్టిప్లెక్స్ కట్టాలని నిర్ణయించారు.ఆ మేరకు నిర్మాణాలు ప్రారంభించేందుకు బస్టాండ్‌ను ఖాళీ చేశారు. కానీ అదే సమయంలో సీఎం అయిన తర్వాత జగన్ శంకుస్థాపన చేసిన బస్టాండ్ సిద్ధం కాలేదు. అసలు పునాదుల దశ దాటలేదు. కాంట్రాక్టర్‌కు బిల్లులు రాకపోవడంతో ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దీంతో బస్సులు ఎక్కేందుకు ప్రయాణికలకు జాగా లేకుండా పోయిది. దీంతో ప్రస్తుతానికి తడికల పందిరి వేసి అదే బస్టాండ్ అని పిలుస్తున్నారు.
మూడేళ్లలో కనీసం ఓ బస్టాండ్ కూడా కట్టలేకపోయిన అదీ సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయిన జగన్ ఇక మూడు రాజధానులు కడతారా అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో సమాధానం చెప్పుకోవడం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు కూడా కష్టంగా మారింది. ఆ పార్టీ నేతలు స్పందించలేకపోతున్నారు