పులివెందుల బస్టాండ్ గ్రాఫిక్స్ చూపించి మూడేళ్లయింది. మూడేళ్ల తర్వాత అక్కడ పూరి పాక ఉంది. ఆ విషయంపై సీఎం జగన్పై ఆయన పాలనపై జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. కానీ ఒక్కరూ కిక్కురుమనలేదు. ఇప్పుడు అదే పులివెందుల నుంచి అంతకు మించిన స్టోరీ బయటకు వచ్చింది. పులివెందులలో మెడికల్ కాలేజీ నిర్మించాలని సీఎం జగన్ నిర్ణయించారు. భూములు సేకరించారు. శంకుస్థాపన చేసేశారు.
వాస్తవానికి ఆ మెడికల్ కాలేజీకి ఇంత వరకూ అనుమతుల్లేవు. అది వేరే విషయం. ఇప్పుడు భూమి సేకరించిన వారికి కూడా డబ్బులివ్వలేదన్న విషయం బయటపడింది. ఎలా బయటపడిందంటే.. భూమి యజమాని వచ్చి.. మెడికల్ కాలేజీ కంటే ముందే ఆ స్థలంలో కట్టిన షెడ్డును కూల్చేయడంతో యటకు వచ్చింది. కె.వెలమవారిపల్లెకు చెందిన కె.మునిస్వామినాయుడు నుంచి కూడా 1.50ఎకరాల భూమి తీసుకుంది. అందులో 83 సెంట్లకు పరిహారం వచ్చింది. మిగిలిన 67 సెంట్లకు పరిహారం రూ.31. 55 లక్షలు ఇంతవరకు ఇవ్వలేదు.
19 నెలలుగా పరిహారం కోసం కలెక్టర్, ఎంపీ, పులివెందుల కోసం ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్పొరేషన్ ఓఎస్డీ చుట్టూ తిరిగినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో తన భూమిలో హద్దు కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన రేకులను ఎక్సకవేటర్ సాయంతో పీకేశారు. సెక్యూరిటీ సిబ్బం ది కోసం ఏర్పాటుచేసిన షెడ్డును కూడా రైతు తొలగించారు. ఈ విషయం విస్తృతంగా ప్రచారం కావడంతో అప్పటికప్పుడు రైతును పిలిచి పదిహేను రోజుల్లో ఇచ్చేస్తామని బతిమాలుకున్నారు. అధికారం ఉంది కాబట్టి రేపోమాపో ఆ రైతుపై కేసులు పెట్టి లోపలేయవచ్చు కానీ.. చేసిన ఘనకార్యాన్ని మాత్రం హైలెట్ కాకుండా ఆపుకోలేరు.