ఎన్నికల్లో జగన్ ఓడిపోయాడు కానీ , ఆయన నియంతృత్వ విధానాలు మాత్రం మారలేదనే తరహాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు పులివెందుల ఎమ్మెల్యే. అసెంబ్లీ దగ్గర విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను బెదిరించడంతో.. గతంలో అయ్యన్న చేసిన వ్యాఖ్యలను తాజాగా జగన్ తన ప్రవర్తన ద్వారా మరోసారి తెరమీదకు తీసుకొచ్చినట్లు అయింది.
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నల్ల కండువాలు, ప్లకార్డులతో తొలిరోజు అసెంబ్లీకి వచ్చారు జగన్. ఈ సందర్భంగా ప్లకార్డులు, నల్ల కండువాలు వదిలేసి అసెంబ్లీ లోపలి వెళ్లాలని వైసీపీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా వారితో తీవ్ర వాగ్వాదానికి దిగడమే కాకుండా పోలీసులను బెదిరించారు.
Also Read : గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని ఏం సాధిస్తారు జగన్?
మధుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో..రోజులన్నీ ఒకేలా ఉండవంటూ వార్నింగ్ ఇచ్చారు. జగన్ అధికారం కోల్పోయాక కూడా తన సహజ స్వభావాన్ని మాత్రం మానుకోవడం లేదు. పోలీసుల విధులకు ఆటంకం కల్గిస్తూ ప్రజాస్వామ్యం అంటూ భారీ, భారీ డైలాగ్ లు కొడుతున్నారు. పోలీసులంటే ఇంకా తన ప్రైవేట్ సైన్యమని భ్రమలో జగన్ ఉన్నారని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఇకనైనా ఆయన బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు.
ఏదీ ఏమైనా పోలీసులతో తాజాగా జగన్ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది.