కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. జిమ్ లో వ్యాయామం చేస్తున్న ఆయన ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోయారు. ఆయన్ని వెంటనే బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు . ఐసియూలో చిక్సిత అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని హాస్పిటల్ వర్గాలు మరి కాసేపట్లో ప్రకటించడానికి సిద్ధమౌతున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ చిత్ర పరిశ్రమని తీవ్రంగా కలచివేసింది. పునీత్ మరణ వార్తతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఇప్పటికే కర్నాటక ప్రభుత్వం రాష్ట్రంలో హై అలెర్ట్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు మూసి వేయాలని ఆదేశించింది. పునీత్ ని కడసారి చూసుకోవడానికి… చిత్రసీమ ఇప్పుడు విక్రమ్ ఆసుపత్రికి తరలి వస్తోంది. పునీత్ కి రెండు రోజులుగా ఆరోగ్యం బాలేదు. ఆయనకు జిమ్ పై శ్రద్ధ ఎక్కువ. ఒంట్లో బాగాలేకపోయినా, అతిగా వ్యాయామం చేయడం వల్లే….ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.