దేవుడి ఆశీర్వాదం .. ప్రజల ఆదరాభిమానాల వల్ల రేపు మనందరి ప్రభుత్వం వస్తే.. 200 యూనిట్ల కరెంట్ ఉచితం అంటూ దేనికి దేనికి ఎంత కరెంట్ వాడతారో కూడా లెక్క చెప్పిన ప్రతిపక్ష నేత వీడియోను ఏపీ ప్రజలంతా చూసే ఉంటారు. ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటారు. కానీ ఆయన ఒక్క యూనిట్ కూడా కరెంట్ ఉచితంగా ఇవ్వలేదు కానీ 35 యూనిట్లు లోపు కరెంట్ వాడుకునే నిరుపేదలపైనా కరెంట్ చార్జీల భారం మోపారు. దేశంలో అందరూ ఇలా ఉండరని పంజాబ్ సీఎంను చూస్తే అర్థమైపోతుంది. ఆయన ఎన్నికల ప్రచారంలో ఆప్ గెలిస్తే ప్రతి ఇంటికి మూడువందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నారు. అన్నట్లుగా పథకాన్ని అమల్లోకి తెచ్చారు.
ప్రతి ఇంటికి మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్న పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ తమ హామీని నిలబెట్టుకుంది. జూలై నుంచి పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీ మేరకు … రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఆమ్ ఆద్మీ సర్కారు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. ఇక, ఎన్నికల్లో మరో ప్రధాన హామీ అయిన డోర్‌స్టెప్ రేషన్ డెలివరీ పథకాన్ని సిఎం గత నెలలో అమల్లోకి తెచ్చారు.
అక్కడ కులం చూడరు. మతం చూడరు. మూడు వందల కన్నా ఎక్కువ యూనిట్లు కరెంట్ వాడతారా లేదా అన్నది చూడరు . అంతకు మించి అర్హతల పేరుతో లబ్దిదారులను తగ్గించే స్కీమ్ అసలు ఉండదు. పథకానికి అందరూ అర్హులే. ఆ పథకం ప్రతి ఇంటికి మూడు వందల యూనిట్ల కరెంట్ ఉచితం. ఎన్నికల హామీగా ఆమ్ ఆద్మీ ఇచ్చింది. అధికారం చేపట్టిన నెలలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అమలు చేయడం ప్రారంభించారు కానీ గత ప్రభుత్వం అంటూ ఆరోపణలు చేసి కారణాలు చెప్పలేదు.