దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడితో సహా.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పర్చూరు నుంచి వైసీపీ టిక్కెట్‌ను కుమారుడికి ఖరారు చేయించుకున్నారు. అయితే.. తన భార్య దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలోనే ఉంటుందని చెప్పారు. దాంతో.. రాజకీయంగా సహజంగానే తీవ్రమైన విమర్శలు ప్రారంభమయ్యాయి. వైసీపీ, బీజేపీ మధ్య ఉన్న అండర్స్టాండింగని.. టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. ఇవన్నీ రాజకీయ విమర్శలు. కానీ.. దగ్గుబాటి హితేష్ చెంచురామ్.. అసలు ఇండియన్ కాదు అన్న విషయం బయటకు వచ్చిన తర్వాత.. అన్ని విషయాలు ఒక్క సారిగా… వెలుగులోకి వచ్చాయి. అసలు దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు పిల్లలు నివేదిక, హితేష్ ఇద్దరూ ఇండియన్స్ కాదు. పుట్టుకతోనే అమెరికన్స్.. అన్న విషయం విషయం హాట్ టాపిక్ అయింది.
దగ్గుబాటి పురందేశ్వరి.. ప్రత్యేకంగా కాన్పు కోసమే.. అక్కడికి వెళ్లి పిల్లల్ని కని .. అక్కడి దేశ పౌరసత్వం తన పిల్లలకు ఇప్పించుకున్నారని.. ఇదేమి నైతికత.. ఇదేమి జాతీయత.. అనే విమర్శలు తీవ్రంగా వచ్చాయి. ఉద్యోగం కోసమో.. వ్యాపారం కోసమో.. అమెరికా వెళ్లి అక్కడి స్థిరపడి… పిల్లలు పుడితే.. అమెరికన్ పౌరసత్వం ఎంచుకోవడం… పెద్ద విషయమేం కాదు. కానీ పురందేశ్వరి ప్రత్యేకంగా కాన్పు కోసమే.. అమెరికా వెళ్లారనేది అసలు విషయం. అదీ కూడా పిల్లల పౌరసత్వం కోసమేననేది అసలు విమర్శలు. సోషల్ మీడియాలో ఇవి వైరల్ అవడంతో.. పుందేశ్వరి.. ఎమోషనల్‌గా ఓ లెటర్ రాశారు. నివేదిత, హితేష్ పుట్టడానికి ముందు తనకు ఇద్దరు పిల్లలను పుట్టక ముందే కోల్పోయానని.. అందుకే.. తన తండ్రి.. ఎన్టీఆర్ బలవంతం మీద చికిత్స కోసం అమెరికా పంపించారని… ఆ వివరణలో ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని బాధపడ్డారు.
చికిత్స కోసం అమెరికా వెళ్లడం.. జాగ్రత్త కోసం.. అమెరికాలో చికిత్స చేయించుకోవడాన్ని ఎవరూ అబ్జెక్షన్ పెట్టడం లేదు కానీ… కేవలం కాన్పు కోసం వెళ్లి అక్కడ… పుట్టిన పిల్లలకు.. అమెరికా పౌరసత్వం ఆప్షన్ ఎంచుకోవడమే.. అసలు విమర్శలకు కారణం అవుతోంది. అమెరికాలో విదేశీ జంటలు… ఎవరికైనా జన్మనిస్తే.. పుట్టే బిడ్డకు ఏ దేశ పౌరసత్వం కావాలో.. ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. భారత జంట.. స్వచ్చందంగా తమకు భారత పౌరసత్వమే కావాలని కోరుకోవచ్చు. అమెరికన్ పౌరసత్వం కావాలంటే అదే ఇస్తారు. కాన్పు కోసమే వెళ్లిన పురందేశ్వరి .. తన బిడ్డలకు.. భారత పౌరసత్వం వద్దని.. అమెరికా పౌరసత్వం కావాలని ఎందుకు ఎంచుకున్నారో మరి..! ఈ విషయం తన ఆవేదనా లేఖలో వెల్లడిస్తే బాగుండేది కదా..!