‘మెహబూబా’ మీద ఆకాశ్‌పూరి చాలా ఆశలే పెట్టుకున్నాడు. కానీ, రిజల్ట్ తేడా కొట్టింది! దర్శకుడిగా పూరి జగన్నాథ్‌లో కొంత మార్పు కనిపించింది. ప్రేక్షకులు ఆ మార్పు కంటే ఎక్కువ కోరుకున్నారు. పూరి దర్శకత్వంలో మునుపటి మార్క్ కనిపించలేదన్నారు. దాంతో ఆకాష్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. విడుదల తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న ఈ కుర్రాడు కొత్త సినిమాకు సంతకం చేశాడని సమాచారం. నిజానికి కుమారుడితో వరుసగా మూడు సినిమాలు చేస్తానని పూరి జగన్నాథ్ ‘మెహబూబా’ విడుదల సమయంలో చెప్పారు. ఇప్పుడు బయట దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పారని తెలుస్తుంది. ఆదిత్య ఇమంది అనే కొత్త దర్శకుడితో ఆకాష్ పూరి ‘అరణ్యం’ అనే సినిమా చేస్తున్నాడు. దీనికి అశోక్ నాయక్ నిర్మాత. త్వరలో సినిమా స్టార్ట్ అవుతుందట! అటవీ నేపథ్యంలో రోడ్ జర్నీ మూవీగా రూపొందనుందని టాక్!