పూరి జగన్నాథ్ – మహేష్‌బాబు ఎప్పుడూ హాట్ హాట్ కాంబినేషనే. పోకిరి పుట్టించిన వైబ్రేషన్స్ ఇప్పటికీ మర్చిపోరు సినీ జనాలు. అప్పటి వరకూ ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నీ పోకిరి వచ్చి ఊడ్చేశాడు. పూరికి అదే ఆఖరి బిగ్గెస్ట్ హిట్. పోకిరి అంత కాదుగానీ, బిజినెస్మెన్ కూడా తన లెవిల్లో ఓకే అనిపించుకొంది. ఆ తరవాతి నుంచీ వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ ఎప్పుడొస్తుందా అంటూ అభిమానులు ఎదురుచూపుల్లో పడిపోయారు. దానికి పూరి ‘జగగణమన’తో సమాధానం కూడా చెప్పారు. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఈ టైటిల్ హాట్ టాపిక్‌గా మారింది. టైటిల్‌తోనే పూరి సగం హిట్టుకొట్టేశాడంటున్నారు జనాలు.
అయితే పూరి దగ్గర ఇప్పుడున్నది టైటిల్ మాత్రమేనట. దాని చుట్టూ ఓ కథ అల్లుకొంటున్నాడిప్పుడు. ఆ కథ మహేష్‌కి నచ్చాలి, ఆ తరవాత సినిమా వర్కవుట్ అవ్వాలి.. ఇలా చాలా తతంగమే ఉంది. చిరంజీవి 150వ సినిమాకీ పూరి జగన్నాథ్ పేరే వినిపించింది. ఆసినిమాకి ఆటోజానీ అనే టైటిల్ ఫిక్స్ చేసి… చిరుని టెమ్ట్ చేశాడు. ఆటోజానీ అనగానే చిరు కూడా పూరితో సినిమా చేద్దామనుకొన్నాడు. ఆటోజానీలానే.. ఇప్పుడు జనగణమన టైటిల్ కూడా టెమ్ట్ చేస్తోంది. ఈ టైటిల్ కథ.. కథవరకూ వెళ్తుందా, లేదంటే ఆటోజానీలా అవుతుందా అన్నది అనుమానంగా మారింది. మహేష్ ఇది వరకటిలా కాదు. ఇప్పుడు బాగా స్ట్రిట్ అయిపోయాడు. కథ విషయంలో ఏమాత్రం రాజీ పడడం లేదు. పూరి మాత్రం కథల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటాడు. మరి…. ఈసారైనా టైటిల్‌పై పెట్టిన శ్రద్ధ స్ర్కిప్టుపై పెడితే బాగుంటుంది.