పూరి జగన్నాథ్ కథలన్నీ హీరోయిజం చుట్టూనే తిరుగుతుంటాయి. డైలాగులతో, క్యారెక్టరైజేషన్‌తో హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తుంటారాయన. అందుకే ఆయన కథల్లో హీరోయిజం తప్ప ఇంకేం కనిపించదు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు ఆయన ముందు నుంచీ దూరమే. అయితే `ఇస్మార్ట్ శంకర్` కోసం మాత్రం ఓ వెరైటీ స్టోరీ ఎంచుకున్నాడు. రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ప్రచార చిత్రాలు చూస్తుంటే పాతబస్తీ కుర్రాడు చేసే దందా.. నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందనిపిస్తుంది. అయితే దానికి ఓ విచిత్రమైన కాన్సెప్ట్‌ని ముడిపెట్టాడట. అదే.. బ్రెయిన్ ఎక్చేంజ్. అంటే.. మెదళ్లను మార్చేస్తారన్నమాట. రామ్ అనుకోకుండా ప్రమాదానికి గురవుతాడు. తన బ్రెయిన్ దెబ్బతింటుంది. రామ్‌కి మరో బ్రెయిన్ అమరుస్తారు. అక్కడి నుంచి ఈ కథ స్వరూపం పూర్తిగా మారిపోతుంది. అదెలాగన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ టైటిల్‌కి `డబుల్ దిమాఖ్` అనే క్యాప్షన్ జోడించాడు పూరి. దాని వెనుక ఉన్న రహస్యం ఇదే.