రచయిత విజయేంద్ర ప్రసాద్ కి పూరి జగన్నాథ్ అంటే చాలా ఇష్టం. ఆయన ఫోన్ వాల్ పేపర్ లో పూరి ఫోటోనే వుంటుంది. చాలా సందర్భాలలో తన ఇష్టాన్ని వ్యక్తి చేశారాయన. తాజాగా పూరి జగన్నాథ్ చెప్పిన ఓ సంగతి ఇంకా ఆసక్తికరంగా వుంది. డబుల్ ఇస్మార్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తనకి చేసిన ఓ ఫోన్ కాల్ గురించి చెప్పారు పూరి.
”విజయేంద్ర ప్రసాద్ గారు ఒకసారి ఫోన్ చేశారు. నెక్స్ట్ సినిమా ఎప్పుడు తీస్తున్నారు, తీసే ముందు నాకు కథ చెప్పండి, మీలాంటి డైరెక్టర్స్ ఫెయిల్ అవ్వడం నేను చూడలేను, చిన్న చిన్న తప్పులు ఎవైనా చేస్తుంటారు, తీసే ముందు ఒకసారి చెప్పండని కోరారు. ఆ ఒక్క ఫోన్ కాల్ తో చాలా ఎమోషనల్ అయిపోయాను. నామీద ఆయనకి వున్న ప్రేమ, అభిమానంతో ఆ కాల్ చేశారు. అయితే తర్వాత ఆయనకి కథ చెప్పలేదు. మనకి తెలిసిన పనే కదా కాస్త వొళ్ళు దగ్గరపెట్టుకొని తీసిన ఆయన్ని కలుద్దామని చెప్పలేదు. ఇది వొళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన సినిమా’ అని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.