చిరంజీవి చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంటే… వాల్తేరు శ్రీను, భోళా శంకర్, గాడ్ ఫాదర్ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. వాల్తేరు శ్రీనులో మరో కథానాయకుడు రవితేజ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో మరో స్పెషలాఫ్ ఎట్రాక్షన్ చేరింది. ఇందులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ బయటపెట్టేశాడు.
విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘జనగణమన’ ఈరోజే పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా ‘చిరుతో సినిమా చేసే అవకాశం ఎందుకు మిస్సయ్యింది’ అని పూరిని అడిగితే… ఆయన దానికి కారణాల్ని చెప్పుకొచ్చారు. అయితే ఆ పక్కనే ఉన్న విజయ్ దేవరకొండ మైకు అందుకుని.. ”పూరి త్వరలో చిరు సార్‌తో కలిసి నటిస్తున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరూ యాక్టింగ్ కొలిగ్స్” అంటూ ఆ సీక్రెట్ బయటకు చెప్పేశాడు. గాడ్ ఫాదర్లో పూరి నటించే అవకాశమే లేదు. భోళా శంకర్ కూడా అంతే. పూరి కనిపించే ఛాన్స్ ఒక్క `వాల్తేరు శ్రీను`లోనే ఉంది. సో… పూరిని ఆ సినిమాలో చూడొచ్చన్నమాట.