పూరి జగన్నాథ్కి హిట్లూ, ఫ్లాపులూ కొత్తేం కాదు. పడ్డాడు… మళ్లీ లేచాడు. కానీ… `లైగర్` రిజల్ట్ మాత్రం పూరిని ఒక్కసారిగా అథఃపాతాళానికి తీసుకెళ్లిపోయింది. లైగర్ విషయంలో పూరి చేసిన తప్పేంటంటే.. దాన్ని పాన్ ఇండియా స్టఫ్ గా నమ్మడం. కావల్సినదానికంటే భారీగా ఖర్చు పెట్టడం. ఈ రెండూ పూరిని గట్టిగా దెబ్బకొట్టాయి. దానికి తోడు ఈ సినిమాతో పంచాయితీలు ఎక్కువయ్యాయి. బయ్యర్లు, ఫైనాన్షియర్లు.. పూరిపై పడ్డారు. సెటిల్మెంట్ చేయమంటూ.. ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్లందరికీ ముందు మెత్తగా నచ్చచెప్పడానికి ప్రయత్నించిన పూరి… కుదరని పక్షంలో ఘాటుగా తనదైన శైలిలో వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా… పూరికి తలనొప్పులు తగ్గలేదు. తనకు అన్నివైపుల నుంచీ ఒత్తిడి ఎక్కువైంది.
పూరి ఎవరికీ హ్యాండ్ ఇచ్చే టైపు కాదు. ఉన్నప్పుడూ, లేనప్పుడూ.. బిందాస్ గా బతికేస్తాడు. ఇచ్చే వ్యక్తే గానీ, లాక్కునే అలవాటు లేదు. సినిమాల్లో నష్టాలొస్తే.. భర్తీ చేయాలన్న రూలేం లేదు. కానీ.. పూరి అందుకు ఒప్పుకొన్నాడు. కాకపోతే.. తనకు కొంచెం టైమ్ కావాలి అంతే. `నాకు రావల్సిన ఎమౌంట్ ఉంది.. రాగానే ఇచ్చేస్తా` అని పూరి ఇప్పటికీ చెబుతూనే ఉన్నాడు. ఎంత కోటీశ్వరుడైనా.. లిక్విడ్ క్యాష్ తక్కువ ఉంటుంది. స్థిరాస్థుల్ని అమ్ముకొంటే తప్ప.. పూరి ఈ సెటిల్మెంట్ చేయలేడు. అలాంటి ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఈ వ్యవహారం అతి త్వరలో పూరి సెటిల్ చేసుకోగలడు. కాకపోతే..ఈలోగానే తన ఇమేజ్ కి డామేజ్ అయ్యే ప్రమాదంలో పడింది. రాబోయే రోజుల్లో పెద్ద హీరోలు పూరితో సినిమాలు చేయడానికి ముందుకొస్తారా? అనేది డౌటు. `లైగర్` గొడవలు… పూరి తీయబోయే సినిమాలకూ అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఈ ఎపిసోడ్ లో ఇంకో ఆసక్తికరమైన ట్విస్టేమిటంటే.. ఛార్మి ఎక్కడా కనిపించకపోవడం, వినిపించకపోవడం. `లైగర్` విషయంలో అంతా నేనే అన్నట్టు వ్యవహరించిన ఛార్మి ఇప్పుడు పత్తా లేకుండా పోయింది.