ఇడియట్, పోకిరి, లోఫర్… ఇలా తిట్లనే సినిమా టైటిళ్లుగా మార్చుకొన్న ఘనత పూరి జగన్నాథ్‌కి దక్కుతుంది. పూరి ట్రెండ్ మొదలయ్యాక… టైటిళ్లలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పూరిని స్ఫూర్తిగా తీసుకొని… చాలామంది దర్శకులు తిట్లనే టైటిళ్లుగా పెట్టేశారు. ‘ఇలాంటి టైటిళ్లు కూడా పెట్టుకోవొచ్చా’ అనే అనుమానం నుంచి, ఎలాంటి పదాలైనా టైటిళ్లుగా పనికొస్తాయి అనే నమ్మకం కలిగించాడు. ఇప్పుడు పూరికి ఓ కొత్త టైటిల్ దొరికింది. అదే.. కసాయి. ఇజం సినిమాలో… ‘కసాయి’ టైటిల్‌పై హీరోయిన్‌తో ఓ డైలాగ్ వేయించాడు పూరి. ‘వీడితో కసాయి అనే టైటిల్‌తో సినిమా తీస్తే సూపర్ హిట్టే’ అంటూ అతిథి ఆర్యతో పలికించాడు పూరి. అంటే.. ‘కసాయి’ టైటిల్ పూరి మైండ్‌లో ఉన్నట్టే. ఏ చిన్న విషయాన్నీ ఊరకే వదిలేయని పూరి… కసాయి టైటిల్‌నీ వీరలెవిల్లో వాడేసుకోవడానికి రెడీ అయిపోతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి కసాయి గా కనిపించేది ఎవరో కాలమే చెప్పాలి.