కమర్షియల్ ఫైట్స్, ఐటమ్ సాంగ్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాలతో సినిమా తీస్తే.. పూరి మళ్లీ అదే తీశాడంటారు. కొత్తగా తీయలేడా? అని ప్రశ్నిస్తారు. కొత్తగా తీస్తే.. పూరి మార్క్ మిస్ అయ్యిందని కంప్లయింట్ చేస్తారు – ఈ రోజు జరిగిన ‘మెహబూబా’ థాంక్యూ మీట్లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చెప్పిన మాట! ఇది ఖచ్చితంగా విమర్శకులపై సెటైర్ లేదా పంచ్ డైలాగ్ అనుకోవాలి. తనయుడు ఆకాష్ పూరిని హీరోగా రీ ఇంట్రడ్యూస్ చేస్తూ, పూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మెహబూబా’ విమర్శకులతో పాటు ప్రేక్షకులను కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. పూరి కొత్తగా తీయాలని ప్రయత్నించాడు గానీ పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడనీ, దీని బదులు ఆయన రెగ్యులర్ స్టయిల్లో సినిమాలు తీస్తే మంచిదనీ చాలామంది అభిప్రాయపడ్డారు. అటువంటి వాళ్లందరిపై పూరి డైలాగ్ వేశాడన్నమాట. ఈ థాంక్యూ మీట్లో సినిమాకు ఆదరణ బాగుందని సినిమా టీమ్ అందరూ చెప్పుకొచ్చారు.