పూరి జగన్నాథ్ చాలా ఇష్టంగా రాసుకున్న కథ `జనగణమన`. మహేష్ బాబుతో ఈ సినిమా చేద్దామనుకున్నాడు. ఎనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ…. అనుకోకుండా మహేష్ డ్రాప్ అయ్యాడు. అప్పటి నుంచీ ఆ కథ అలానే ఉంది. ఎప్పటికైనా సరే, ఆ సినిమాని మహేష్ తో చేయాలన్నది తన ఆశ. అయితే ఇప్పుడు ఆ ఆలోచన మారింది. వీలైనంత త్వరగా ఈ స్క్రిప్టుని తెరపై చూసుకోవాలని పూరి భావిస్తున్నాడట. `కేజీఎఫ్` హీరో యశ్‌తో పూరి ఓ సినిమా చేయబోతున్నాడు. అది `జనగణమన` కాదు. మరో కథ.
యశ్‌తో సినిమా అయ్యాక.. `జనగణమన`ని మొదలెట్టే ఛాన్సుంది. అయితే ఈసారి సోనూసూద్ తో ఈ సినిమా చేయబోతున్నాడని టాక్. సోనూ ఇప్పుడు రియల్ హీరో. దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తనైతే ఈ కథకు బాగుంటుందని పూరి భావిస్తున్నాడట. పైగా సోనూ అంటే పూరికి చాలా ఇష్టం. పూరి తన సినిమాల్లో సోనూకి మంచి పాత్రలు ఇచ్చాడు. ఇద్దరి మధ్యా మంచి అనుబంధం ఉంది. అందుకే.. ఈ కథని సోనూతో సెట్ చేయాలని ఫిక్సయ్యాడని తెలుస్తోంది.