లైగర్, డబుల్ ఇస్మార్ట్ పరాజయాలు పూరి జగన్నాథ్‌కి పది అడుగులు వెనక్కి లాగేశాయి. పూరి మళ్లీ నిలబడాలంటే, పూరి వైపు అందరి దృష్టీ పడాలంటే ఇప్పుడు కచ్చితంగా ఓ హిట్టు కొట్టాల్సిందే. దానికి తగినట్టుగానే పూరి కష్టపడుతున్నాడు. ఇది వరకెప్పుడూ లేనంతగా కథపై కసరత్తు చేసి ఓ పర్ఫెక్ట్ స్క్రిప్టు తయారు చేసుకొన్నాడు. కాస్టింగ్ విషయంలోనూ ఆచి తూచి అడుగులేస్తున్నాడు. విజయ్ సేతుపతి కి కథ చెప్పి, ఓకే చేయించుకోవడంలోనే పూరి తొలి సక్సెస్ కొట్టాడు. అసలు ఈ కాంబోనే క్రేజీగా వుంది. ఆ తరవాత ఈ టీమ్‌లోకి టబు వచ్చింది. దునియా విజయ్‌ని ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఎంచుకొన్నార్ట. ఈ పేర్లు, స్టార్ కాస్ట్.. క్రేజ్ మరింత పెంచుతోంది.
ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ వుందని, నివేదా థామస్, రాధికా ఆప్టేలను కూడా టీమ్‌లోకి తీసుకొన్నారని వార్తలొస్తున్నాయి. నిజానికి వీరిద్దరి పేర్లూ పరిశీలనలో లేవని తెలుస్తోంది. ఓ కథానాయిక ఉంటుందని, అయితే ఆమెను ఇంకా ఖారారు చేయలేదని, బాలీవుడ్ కు చెందిన ఓ నటీమణితో సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలోనే ఆమె పేరు అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.
ఈ సినిమా కోసం ‘బెగ్గర్’ అనే పేరు పరిశీలనలో వుంది. 60 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలన్నది పూరి ప్లాన్. మే నెలాఖరుకు గానీ, జూన్ మొదటి వారంలోగానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ యేడాది చివర్లో విడుదల అయ్యే ఛాన్సుంది.